నమ్ముకున్న కార్యకర్తకు అండగా నిలిచిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

చికిత్స కోసం లక్ష రూపాయల తక్షణ ఆర్థిక సహాయం


నమ్ముకున్న కార్యకర్తకు అండగా నిలిచిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు:

తనను నమ్ముకున్న కార్యకర్తలకు, మద్దతుదారుల కష్టనష్టాల్లో వెన్నంటి  నిలుస్తూ నేటి తరం రాజకీయ నాయకులకు ఆదర్శంగా నిలుస్తున్నారు పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి. 

 రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని ఎస్ఎన్ కాలనీకి చెందిన యూసుబ్ దశాబ్దాలుగా ఎమ్మెల్యే జిఎంఆర్ అనుచరుడుగా కొనసాగుతున్నారు. నికార్సైన కార్యకర్తగా అనునిత్యం ఎమ్మెల్యే జిఎంఆర్ కోసం పనిచేసేవారు. ఇటీవల క్యాన్సర్ వ్యాధి సోకి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు.

విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే జిఎంఆర్ బుధవారం ఉదయం యూసుబ్ నివాసానికి వెళ్లి పరామర్శించి..ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అధైర్య పడవద్దని.. అండగా ఉంటానని భరోసా అందించారు. తక్షణ వైద్య చికిత్స నిమిత్తం లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించారు. నిపుణులైన వైద్యులచే చర్చించి మెరుగైన వైద్య చికిత్స అందించనున్నట్లు తెలిపారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 35 సంవత్సరాలుగా తన కష్ట నష్టాల్లో.. గెలుపు ఓటముల్లో.. తమ కుటుంబానికి అండగా నిలుస్తున్న ప్రతి కార్యకర్తకు వెన్నంటి నిలుస్తున్నామని తెలిపారు. 

నమ్ముకున్న నాయకుడు తన కష్టాల్లో అండగా నిలవడం ఎంతో సంతోషంగా ఉందని యూసుబ్ తెలిపారు.

About The Author