ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుని ఇంటి నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్

కామారెడ్డి జిల్లా :
ఇళ్ల నిర్మాణానికి అవసరమైన సిమెంట్, ఇసుక, ఇటుకలు వంటి సామగ్రి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ సూచించారు. లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమైన ఉంటే వెంటనే పరిష్కరించాలన్నారు.
గ్రామాల్లో ఇంకా అర్హులైన లబ్ధిదారులను గుర్తించి మార్కవుట్ పనులు ప్రారంభించాలని తెలిపారు.
Read More వంతెన మరమ్మత్తు.. వాహనాలు మళ్లింపు
ఈ సందర్భంగా లబ్ధిదారుడు , గ్రామస్తులు చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు తెలుపుతూ, గ్రామంలో చేపట్టే ఇందిరమ్మ ఇండ్ల సామూహిక గృహప్రవేశానికి తమరు కచ్చితంగా రావాలని కలెక్టర్ ను కోరగా గృహప్రవేశానికి తప్పకుండా వస్తానని తెలిపారు . ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పంచాయతీ కార్యదర్శులు, ఇంజనీర్లు, తదితరులు పాల్గొన్నారు.
Read More పార్టీని నమ్ముకుంటేనే సముచిత స్థానం
About The Author
13 Dec 2025
