జిల్లాలో సరిపోను యూరియా నిల్వలు ఉన్నాయి

రైతులెవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

జిల్లాలో సరిపోను యూరియా నిల్వలు ఉన్నాయి

సూర్యాపేట:

సూర్యాపేట జిల్లాలో రైతులందరికీ సరిపోయిన ఎరువులు యూరియా అందుబాటులో ఉందని రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన పనిలేదని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవర్ అన్నారు. గురువారం సూర్యాపేట మండలం పిల్లలమర్రి పిఎసిఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న  ఎరువుల గోదామును ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి రిజిస్టర్, ఈ పాస్ మిషన్ లను పరిశీలించారు.
ఇప్పటివరకు పిల్లలమర్రి పిఎసిఎస్ ద్వారా 290.43 మెట్రిక్ టన్నుల యూరియా రైతులకి పంపిణి చేశామని ప్రస్తుతం 11.90 మెట్రిక్ టన్నుల (266 బస్తాలు ) యూరియా నిల్వలు ఉన్నాయని ఇంకో 100 మెట్రిక్ టన్నుల యూరియా అయితే ఈ యాసంగి సీజన్ కు సరిపోతుందని శుక్రవారం సాయంత్రం నాటికి మరో రెండు లారీల యూరియా లోడ్లు వస్తుందని ఏ డి ఏ కలెక్టర్ కు వివరించగా ఎంత యూరియా అవసరం ఉంటే అంత సరఫరా చేస్తామని ఈ సందర్బంగా కలెక్టర్ తెలిపారు.అనంతరం కలెక్టర్ అక్కడే ఉన్న రైతులతో మాట్లాడుతూ ఎరువులు మంచిగా సరఫరా చేస్తున్నారా? ఒక ఎకరం వరి పంట ద్వారా ఎంత ఖర్చవుతుంది, ఎంత దిగుబడి వస్తుందని అడగగా 25 వేల వరకు ఖర్చు అవుతుందని, 33 వేలు మిగులుతాయని తెలిపారు.సాంప్రదాయ పంటలైన వరి నుండి అధిక లాభాలు వచ్చే  పామాయిల్,కూరగాయల సాగు వైపు రైతులు దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా సూచించారు.కలెక్టర్ వెంట డిసిఓ ప్రవీణ్ కుమార్, తహసిల్దార్ కృష్ణయ్య, ఏ డి ఏ జ్ఞానేశ్వరి దేవి, ఏ ఏవో కృష్ణ సందీప్,ఏ ఈ ఓ స్వాతి, పి ఏ సి ఎస్ కార్యదర్శి శ్యామ్ సుందర్ రెడ్డి,తదితరులు ఉన్నారు

About The Author

Related Posts