అదుపు తప్పి ఫుట్‌పాత్‌ పైకి దూసుకెళ్లిన మారుతి కారు

అదుపు తప్పి ఫుట్‌పాత్‌ పైకి దూసుకెళ్లిన మారుతి కారు

ఎల్బీనగర్:

సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తపేట – సరూర్‌నగర్ ప్రధాన రహదారిపై సోమవారం మధ్యాహ్నం ఓ కారు అదుపుతప్పి ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లింది. వీఎం హోమ్ గేటు ముందు ఉన్న ఫుట్‌పాత్‌ను ఎక్కిన మారుతి XL6 (TS 08 HJ 7775) కారు అక్కడ ఉన్న చెరుకు రసం బండిని ఢీకొట్టింది. ఈ ఘటనలో చెరుకు రసం బండి పూర్తిగా ధ్వంసం కాగా, కారు ముందు భాగం కూడా తీవ్రంగా దెబ్బతింది. అదృష్ట వశాత్తు ఈ ఘటన సమయంలో ఫుట్‌పాత్‌పై ఉసిరికాయలు అమ్ముకునే దంపతులు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రమాదానికి గల కారణాలపై సరూర్‌నగర్ పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

About The Author