రోడ్డు భద్రతే లక్ష్యం.. ప్రాణాల రక్షణే ముఖ్యం...
- టిజిఐఐసి చైర్ పర్సన్ నిర్మల జయప్రకాశ్ రెడ్డి
- రోడ్డు భద్రత అవగాహనలో భాగంగా ఐబి నుంచి కలెక్టరేట్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించిన రవాణా శాఖ
సంగారెడ్డి:
జాతీయ రహదారి భద్రత మాసోత్సవం సందర్భంగా గురువారం జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఐబి నుండి జిల్లా కలెక్టరేట్ వరకు బైక్ ర్యాలీని నిర్వహించారు. ఈ బైక్ ర్యాలీలో వివిధ బైక్ షోరూం లకు చెందిన ఉద్యోగులు, సిబ్బంది, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.టి.జి.ఐ.ఐ.సి చైర్‌పర్సన్ నిర్మల జయప్రకాశ్ రెడ్డి జెండా ఊపి బైక్ ర్యాలీని ప్రారంభించారు.ఈ సందర్భంగా నిర్మల జయప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ, ప్రాణాలు చాలా విలువైనవని, నిర్లక్ష్యంతో ప్రమాదాలను కొని తెచ్చుకోవద్దన్నారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. మైనర్లకు వాహనాలు ఇచ్చే తల్లిదండ్రులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించడంలో ప్రతి ఒక్కరి బాధ్యత ఎంతో కీలకమని తెలిపారు.డీఎస్పీ సత్తయ్య గౌడ్ మాట్లాడుతూ, రోడ్డు సేఫ్టీ నిబంధనలను క్రమశిక్షణతో పాటిస్తే ప్రమాదాలను చాలా వరకు నివారించవచ్చన్నారు. ముఖ్యంగా మైనర్లు వాహనాలు నడపకుండా తల్లిదండ్రులు అవగాహన కల్పించాలని సూచించారు. హెల్మెట్, సీటుబెల్ట్ వినియోగం తప్పనిసరి కావాలని తెలిపారు.జిల్లా రవాణా అధికారి అరుణ మాట్లాడుతూ, రోడ్డు భద్రత మాసోత్సవంలో భాగంగా జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలకు రోడ్డు భద్రతపై విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహి
స్తున్నామని తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా అధికారి అరుణ, డీఎస్పీ సత్తయ్య గౌడ్, రవాణా శాఖ సభ్యులు తాహెర్, సంబంధిత అధికారులు, సిబ్బంది, వివిధ బైక్ షోరూం ల ఉద్యోగులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
