నేను ఆరోగ్యంగానే ఉన్నాను.. పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్‌చెరు:
తాను ఆరోగ్యంగానే ఉన్నానని.. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పటాన్‌చెరు శాసన సభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం సాయంత్రం హైదరాబాదులోని తన కార్యాలయంలో బాత్రూం నుండి వచ్చే సమయంలో కాలుజారి పడటం మూలంగా స్వల్పంగా గాయపడడం జరిగిందని పేర్కొన్నారు. వైద్య పరీక్షల అనంతరం.. వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించడం జరిగిందని తెలిపారు. కార్యకర్తలు, నాయకులు, అభిమానులు ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి చేశారు. భగవంతుడు కృపతో.. పటాన్‌చెరు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో.. కార్యకర్తల అభిమానంతో అతి త్వరలో ప్రజాసేవలోకి రానున్నట్లు తెలిపారు.
About The Author
23 Apr 2026
