"ది ప్రెస్ క్లబ్ ఆఫ్ సూర్యాపేట" కమిటీ ఏకగ్రీవం

WhatsApp Image 2025-11-14 at 7.20.41 PM

సూర్యాపేట : 

Read More జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ చేపట్టిన సుందరీకరణ పనులు దాదాపు పూర్తి..

ది ప్రెస్ క్లబ్ ఆఫ్ సూర్యాపేట కమిటీని శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రం కలెక్టరేట్ కార్యాలయం రోడ్డులో గల (ఆర్ ఆర్ ఆర్) ఫంక్షన్ హాలులో నిర్వహించిన కార్యక్రమంలో సుమారుగా 30 మంది జర్నలిస్టులు పాల్గొని ప్రధాన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.అధ్యక్షునిగా సీనియర్ పాత్రికేయులు న్యూస్ 24 అవర్స్ టీవీ చైర్మన్ నాయిని శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శిగా సీనియర్ పాత్రికేయులు "భారత శక్తి" సూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కందుకూరి యాదగిరి, కోశాధికారిగా సీనియర్ పాత్రికేయులు సూర్య సేన తెలుగు దినపత్రిక ఎడిటర్ పాల్వాయి జానయ్య,సీనియర్ ఉపాధ్యక్షులుగా సీనియర్ పాత్రికేయులు ఆంధ్రజ్యోతి సూర్యాపేట రిపోర్టర్ సుంకర బోయిన వెంకటయ్య లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ తమపై నమ్మకం ఉంచి ప్రెస్ క్లబ్ ప్రధాన కమిటీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న జర్నలిస్టు మిత్రులు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రెస్ క్లబ్ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా సోమవారం రోజు పూర్తి కమిటీని ప్రకటిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో సుమారు 30 మంది  జర్నలిస్టులు పాల్గొన్నారు.. 

Read More నామినేషన్ ప్రక్రియలో పొరపాట్లు జరగకుండా చూడాలి

About The Author