డివిజన్ అభివృద్ధిలో ఎంపీ ఈటల పాత్ర కీలకం

కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి కృతజ్ఞతలు

డివిజన్ అభివృద్ధిలో ఎంపీ ఈటల పాత్ర కీలకం

గడ్డిఅన్నారం:


గడ్డిఅన్నారం డివిజన్ సమగ్ర అభివృద్ధికి మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ అందిస్తున్న సహకారం అభినందనీయమని డివిజన్ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి కొనియాడారు. కార్పొరేటర్‌గా తన పదవీకాలం ముగిసిన సందర్భంగా బుధవారం ఉదయం ఆయన ఈటల రాజేందర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు.

​నిధుల కేటాయింపులో వివక్ష చూపని నాయకుడు:

ఈ సందర్భంగా ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ఈటల రాజేందర్ ఎంపీగా గెలిచిన తర్వాత డివిజన్‌లో కోట్ల రూపాయల వ్యయంతో నూతన సీసీ రోడ్లు, స్ట్రామ్ వాటర్ నాలా పనులు వేగంగా పూర్తయ్యాయని తెలిపారు. కౌన్సిల్ సమావేశాల్లో కేవలం భాజపా కార్పొరేటర్లకే కాకుండా, అన్ని పార్టీల సభ్యులకు సమానంగా నిధులు కేటాయించాలని ఎంపీ బలంగా వాదించారని గుర్తుచేశారు. డివిజన్ సమస్యలపై అధికారులతో ప్రత్యేకంగా చర్చించి, పనులు పట్టాలెక్కేలా చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారన్నారు.
పెండింగ్ పనులపై వినతి:
డివిజన్ పరిధిలోని పలు సమస్యలను ఈ సందర్భంగా ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు.
​కమలానగర్ కాలనీ: రోడ్ నెంబర్ 5 వద్ద గత కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న సీఆర్‌ఎంపీ రోడ్ పనులను వెంటనే ప్రారంభించాలని కోరారు.
​న్యూ గడ్డిఅన్నారం కాలనీ: ఇక్కడి కమ్యూనిటీ అభివృద్ధికి ఎంపీ నిధుల నుంచి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
​ప్రజల కోసం నిరంతరం కృషి:
పదవీకాలం ముగిసినా.. గడ్డిఅన్నారం డివిజన్ అభివృద్ధి కోసం ప్రజలతోనే ఉంటానని ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, వీధి దీపాలు, పారిశుధ్యం వంటి సమస్యల పరిష్కారానికి అధికారులతో సమన్వయం చేసుకుంటూ నిరంతరం శ్రమిస్తానని ఆయన వెల్లడించారు.

About The Author