విద్యార్థులను గోస పెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం

విద్యార్థులకు ఫీజు కష్టాలను తీర్చిన కేంద్ర మంత్రి ధన్యవాదాలు
బోరబండ మీటింగ్ అనుమతులు రద్దు చేయడం  అన్యాయం
బిజెపి పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి 

WhatsApp Image 2025-11-06 at 6.56.20 PM

కరీంనగర్ : 
డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ , ఫార్మసీ కాలేజీలు మూతపడి నాలుగు రోజులవుతుందని , ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా  రాష్ట్ర ప్రభుత్వం కళాశాల యాజమాన్యాలను, విద్యార్థులను గోసపెడుతుందని.  బిజెపి పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు ఘాటుగా విమర్శించారు. గురువారం కరీంనగర్లో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 23 నెలల కాలం గడిచిన నేటికీ   ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడం తో  కళాశాల విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిందన్నారు.  ఫీజు రియంబర్స్మెంట్  బకాయిలు చెల్లించే వరకు కళాశాలలు బంద్ కొనసాగుతుందనియాజమాన్యాలు ప్రకటించడంతో   విద్యార్థులు అకాడమిక్ ఇయర్   నష్టపోయే పరిస్థితులు ఉన్నాయన్నారు. సమస్యను  పరిష్కరించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం  నిమ్మకు నీరెత్తినట్టు  వ్యవహరిస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుందని ఆయన మండిపడ్డారు.  కళాశాల యాజమాన్యాలతో  చర్చలు జరిపి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను చెల్లించడానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ పేద  విద్యార్థుల చదువుల   కష్టాలను తీర్చాలనే  దృఢ సంకల్పంతో ముందు కొనసాగుతున్నారని తెలిపారు. ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని పదవ తరగతికి విద్యార్థినీ విద్యార్థులకు. లోగడ సైకిళ్లను పంపిణీ చేసి వారి రవాణా కష్టాలు తీర్చి అండగా నిలిచారన్నారు. నేడు పార్లమెంటు పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 12292 మంది విద్యార్థిని విద్యార్థులందరికీ కేంద్రమంత్రి తన జీతం నుండి  పరీక్ష ఫీజు చెల్లిస్తానని ప్రకటించడం గొప్ప విషయం అన్నారు. విద్యార్థుల టెన్త్ ఎగ్జామ్ ఫీజు పూర్తిగా చెల్లించేందుకు ముందుకు వచ్చిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. అలాగే గురువారం రోజున బోరబండలో షెడ్యూల్ ప్రకారం ఈరోజు సాయంత్రం బోరబండలో కొనసాగాల్సిన కేంద్ర మంత్రి  మీటింగ్ కు అనుమతి ఇచ్చి రద్దు  చేయడంపై మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఒత్తిడికి పోలీసులు తలోగ్గడం సరికాదన్నారు. 

Read More రసాయన శాస్త్రంలో పనస మహేష్ కు పీహెచ్డీ

About The Author