గ్రామీణ క్రీడాకారులలో ప్రతిభను వెలికి తీసి వారిని మరింత ప్రోత్సహించాలి
కామారెడ్డి జిల్లా:
గ్రామీణ క్రీడాకారులలో ఉన్న ప్రతిభను వెలికి తీసి వారిని మరింత ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో గ్రామపంచాయతీ, మండల, మున్సిపాలిటీ, జిల్లా స్థాయిలో చీఫ్ మినిస్టర్ కప్ -2025-26 స్పార్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ, హైదరాబాద్ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్, మేజిస్ట్రేట్, కామారెడ్డి అనుమతిలో జిల్లా యువజన, క్రీడల శాఖ అధ్వర్యంలో సి.యం.కప్-2025-26 టార్చ్ ర్యాలీ గురువారం రోజున స్థలం జడ్ పి హెచ్ ఎస్ బాయ్స్ హై స్కూల్ నుండి ఇందిరాగాంధీ స్టేడియం, కామారెడ్డి వరకు ఉదయం. 10.00 గం,,ల కు శ్రీయుత జిల్లా అదనపు కలెక్టర్ (ఎల్ బి) శ్రీ. మధుమోహన్ గారు జిల్లా గ్రంథాలయ చైర్మన్ శ్రీ మద్ది చంద్రకాంత్ రెడ్డి పచ్చ జెండా ఊపి టార్చ్ ర్యాలీనీ ప్రారంభించారు. అక్కడి నుండి మొదలుకొని నిజాంసా చౌరస్తా - మున్సిపల్ ఆఫీస్ - న్యూ బస్టాండ్ - గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మీదుగా ఇందిరాగాంధీ స్టేడియంలో ర్యాలీ ముగించడం కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా శ్రీయుత జిల్లా అదనపు కలెక్టర్ (ఎల్ బి) మాట్లాడుతూ, క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయికి చేర్చేందుకు 2028 లో జరగనున్న ఒలింపిక్ క్రీడలలో మరిన్ని పథకాలు సాధించేందుకు గ్రామాల నుంచి పట్టణం వరకు యువత చదువుతోపాటు క్రీడల్లో కూడా రాణించాలని కోరారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ శ్రీ మద్ది చంద్రకాంత్ రెడ్డి మాట్లాడుతూ, సి.యం.కప్-2025-26 లో యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా ముఖ్యమంత్రి కప్ - 2025 యొక్క 2వ ఎడిషన్ లో తమ ప్రతిభ ను కనబరచాలని కోరారు క్రీడల వల్ల మానసిక ఉల్లాసం మెరుగుపడుతుందని తెలియజేశారు.
గ్రామపంచాయతీ స్థాయి జనవరి 17 నుండి 22 వరకు గ్రామపంచాయతీ స్థాయి ఆటలు, జనవరి 28 నుండి 31 వరకు మండల, మునిసిపల్ స్థాయి, 2026 ఫిబ్రవరి 03వ నుండి 07వ వరకు అసెంబ్లీ నియోజకవర్గం స్థాయి, ఫిబ్రవరి 10వ నుండి 14వ వరకు జిల్లా స్థాయి క్రీడలను నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. రాష్ట్ర స్థాయికి కామారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం వహించే ఉత్తమ జట్టును ఎంపిక చేయాలని కలెక్టర్ ఆదేశించారు. రాష్ట్ర స్థాయి ఎంపికలు 19వ ఫిబ్రవరి 2026 నుండి 26వ ఫిబ్రవరి 2026 వరకు జరుగుతాయి.
ఈ సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధు మోహన్, కామారెడ్డి జిల్లా గ్రంథాలయ చైర్మన్ శ్రీ మద్ది చంద్రకాంత్ రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ. రాజు, అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జైపాల్ రెడ్డి, సెక్రెటరీ కే.పి అనిల్ కుమార్, హాకీ అసోసియేషన్ ప్రెసిడెంట్ నీలం లింగం, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సెక్రెటరీ హీరా లాల్, పేట.టి.యస్ సెక్రెటరీ శ్రీ నోముల మధుసూదన్ రెడ్డి, టి.జి పేట ప్రెసిడెంట్ శ్రీ స్వామి గౌడ్, టిఎన్ జిఓ అధ్యక్షుడు శ్రీ. వెంకట్ రెడ్డి బి.సి సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీ. నిల నాగరాజు వివిధ క్రీడ సంఘాల అధ్యక్ష కార్యదర్శులు, యువతి యువకులు వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు, కాలేజీ, పాఠశాల విద్యార్ధులు, తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని సి.యం.కప్-2025 టార్చ్ ర్యాలీ ని విజయవంతం చేశారని జిల్లా యువజన, క్రీడా అధికారి శ్రీ.రంగ వెంకటేశ్వర్ గౌడ్ పత్రికా ప్రకటన ద్వారా తెలియజేశారు.
