అన్ని వర్గాలను ఆదుకునేదే ఈ బడ్జెట్

కరీంనగర్, జనవరి 1(భారత శక్తి): కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సంక్షేమము, అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డుల రుణ పరిమితిని పెంచే విధంగా నిధులు కేటాయించడం అభినదనియమని బిజెపి సీనియర్ నాయకులు పోల్సాని సుగుణాకర్ రావు అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కిసాన్ క్రీడిట్ కార్డులు 5 లక్షల వరకు పెంపు, 7.7 కోట్ల కొత్త కిసాన్ క్రెడిట్ కార్డులు, పప్పు దినుసుల కొనుగోలు, జాతీయ పత్తి కమిషన్ ఏర్పాటు, పండ్లు కూరగాయలకు నూతన పథకం, అదికోత్పత్తి వంగడాల పరిశోధనకు ప్రాధాన్యత రైతులకు లాభం చేకూర్చనున్నాయాన్నారు. అలాగే సోలార్ విద్యుత్, తదితర రంగాలకు ప్రాధాన్యతనిస్తూ మరో ప్రధాన రంగమైన MSME కీ అనేక ప్రోత్సాహకాలు ఇవ్వడం జరిగిందని చెప్పారు. ఉద్యోగస్తులు, మధ్యతరగతి వర్గాల ప్రజలకు ఆదాయ పన్ను 12 లక్షల వరకు పెంచడం పెద్ద ఊరట. మౌలిక రంగాలైన రైల్వే, రోడ్లు, విమానాశ్రయాల విస్తరణకు ప్రాధాన్యత. స్టార్ట్ అప్ కంపెనీలకు రాయితీలు, భీమా రంగంలో ఎఫ్డిఐ పరిధి పెంపు లాంటి అనేక కొత్త పథకాల ద్వారా దేశం అభివృద్ధి వైపు ప్రయాణించనుందన్నారు. బడ్జెట్ మధ్యతరగతికి లాభం చేకూర్చేవిగా ఉన్నాయని, కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు.

అన్ని వర్గాలను ఆదుకునేదే ఈ బడ్జెట్

కరీంనగర్, జనవరి 1(భారత శక్తి):
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సంక్షేమము, అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డుల రుణ పరిమితిని పెంచే విధంగా నిధులు కేటాయించడం అభినదనియమని బిజెపి సీనియర్ నాయకులు పోల్సాని సుగుణాకర్ రావు అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కిసాన్ క్రీడిట్ కార్డులు 5 లక్షల వరకు పెంపు, 7.7 కోట్ల కొత్త కిసాన్ క్రెడిట్ కార్డులు, పప్పు దినుసుల కొనుగోలు, జాతీయ పత్తి కమిషన్ ఏర్పాటు, పండ్లు కూరగాయలకు నూతన పథకం, అదికోత్పత్తి వంగడాల పరిశోధనకు ప్రాధాన్యత రైతులకు లాభం చేకూర్చనున్నాయాన్నారు. అలాగే సోలార్ విద్యుత్, తదితర రంగాలకు ప్రాధాన్యతనిస్తూ మరో ప్రధాన రంగమైన MSME కీ అనేక ప్రోత్సాహకాలు ఇవ్వడం జరిగిందని చెప్పారు. ఉద్యోగస్తులు, మధ్యతరగతి వర్గాల ప్రజలకు ఆదాయ పన్ను 12 లక్షల వరకు పెంచడం పెద్ద ఊరట. మౌలిక రంగాలైన రైల్వే, రోడ్లు, విమానాశ్రయాల విస్తరణకు ప్రాధాన్యత. స్టార్ట్ అప్ కంపెనీలకు రాయితీలు, భీమా రంగంలో ఎఫ్డిఐ పరిధి పెంపు లాంటి అనేక కొత్త పథకాల ద్వారా దేశం అభివృద్ధి వైపు ప్రయాణించనుందన్నారు. బడ్జెట్ మధ్యతరగతికి లాభం చేకూర్చేవిగా ఉన్నాయని, కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు.

About The Author