నిర్లక్ష్యం నీడన ప్రయాణం.!

అజాగ్రత్త డ్రైవింగ్ తోనే ప్రమాదాలు
హెల్మెట్ తోనే ప్రాణాలకు రక్షణ
రోడ్డు భద్రత అందరి బాధ్యత
ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించాలి.

నిర్లక్ష్యం నీడన ప్రయాణం.!

మణుగూరు జనవరి 13 (భారతశక్తి): నిర్లక్ష్యంగా వాహనాలు నడపడంతో రోడ్డు ప్రమాదాలలో ఎక్కువగా ద్విచక్ర వాహనదారులే ప్రాణాలు కోల్పోతున్నారు. హెల్మెట్ ధరించక పోవడం ద్వారా, నిర్లక్ష్యంగా వాహనాన్ని నడపడం వలన రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో చాలా మంది వాహన చోదకులు మృత్యువాత పడుతున్నారు. అదే హెల్మెట్ ధరించి వాహనము నడిపి నట్లయితే ప్రమాదాలు జరిగినప్పటికీ మృత్యువు నుంచి తప్పించుకోవచ్చు. హెల్మెట్ ధరిస్తే ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చు నన్న చిన్నవిషయాన్ని విస్మరించి అనేకమంది వాహన చోదకులు అజాగ్రత్తతో ప్రయాణిస్తున్నారు. రోడ్డు ప్రమాదాలలో మరణాల సంఖ్య పెరగడానికి వాహన చోదకులు హెల్మెట్ ధరించక పోవడమే కారణాలుగా నిలుస్తున్నాయి. ద్విచక్ర వాహనాన్ని నడిపే వాహన చోదకులు ముందుగా హెల్మెట్ యొక్క ప్రాముఖ్యత తెలుసు కోవలసిన ఆవశ్యకత ఎంతో ఉంది. హెల్మెంట్ ధరించాలంటే అనేక మంది వాహన చోదకులు ఇబ్బందిగా ఫీలవుతుంటారు. కానీ ఎంత విపత్కర పరిస్థితులు వచ్చినప్పటికీ వాహనం నడిపేటప్పుడు మాత్రము హెల్మెట్ ధరించడం మంచిదన్న విషయం గుర్తుంచు కోవాలి.WhatsApp Image 2026-01-13 at 18.14.51 (1)

 రోడ్డు భద్రత మనందరి బాధ్యత 

హెల్మెట్ మీతోడుంటే ప్రమాదాలు జరిగినప్పటికీ స్వల్ప గాయాలతో బయటపడవచ్చు. హెల్మెట్ పెట్టుకోక పోవడంతో ప్రమాదాలకు గురై ఆసుపత్రులకు వేలు, లక్షల రూపాయలను చెల్లిస్తుంటారు. పోలీస్ యంత్రాంగం ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పిస్తున్నారు.  వాహన చట్టాలపై విద్యార్థులకు పోలీసులు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్న ఫలితం లేకపోతుంది. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసే యువతకు వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇస్తున్న మార్పు రావడం లేదు. ట్రాఫిక్ పోలీసులు హెల్మెంట్ ప్రాముఖ్యత తెలియజేస్తూ వాహన చోదకులకు అవగాహన సదస్సులు, ఫ్లెక్సీలు, ద్వారా చైతన్యవంతులను చేస్తున్నారు.

 పోలీస్ వారి సూచనలు పాటించాలి. 
 
కారు నడుపుతున్న డ్రైవర్లు కూడా నిర్లక్ష్యంగా అతివేగంగా వాహనము నడపడం వలన అదుపు తప్పి ప్రమాదాలకు గురువుతున్నారు. ముఖ్యంగా కారులో ఉన్న అందరూ సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. దానివల్ల రక్షణ కవచంగా ఉంటుంది. జాతీయ రహదారిపై ప్రయాణించేటప్పుడు అతిస్పీడు కాకుండా నిబంధనలు మేరకు డ్రైవింగ్ చేయాలి. అలాగే వాహనము నడుపుతున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ డ్రింక్ చేయకూడదు. పోలీసులు సూచనలు సలహాలు తప్పకపాటించాలి. అతివేగం ప్రమాదకరమని గుర్తించాలి. వాహనచోదకులు నిర్లక్ష్యం వీడితే రోడ్డు ప్రమాదాలు మరి జరగవు. వాహన చోదకులారా తస్మాత్ జాగ్రత్త.

 రోడ్డు భద్రతపై అవగాహన.. 

మండల పరిధిలోని పగిడేరు గ్రామంలో గ్రామ పెద్దలు, సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామస్తులతో సిఐ నాగబాబు రోడ్డు భద్రతపై మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. మణుగూరు డిఎస్పి రవీందర్ రెడ్డి  పర్యవేక్షణలో రోడ్డు భద్రత మసోత్సవాలల్లో భాగంగా సీఐ నాగబాబు, ఎస్సై నగేష్ రోడ్డు ప్రమాదంలో ప్రాణ నష్టంలను తగ్గించాలనే లక్ష్యంతో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ నాగబాబు మాట్లాడుతూ రోడ్డు భద్రతా వారో త్సవాలను ఏటా నిర్వహించి వాహనదారులకు రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పి స్తున్నామన్నారు. వాహనాలలో ప్రయాణించేటప్పుడు సీటు బెల్టు, హెల్మెట్ తప్పకుండా ధరించాలని, ఇన్సూరెన్స్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌ పత్రాలను వెంట తీసుకె ళ్లాలని చెప్పారు. కండీషన్‌లో ఉన్న వాహనాలనే డ్రైవింగ్‌ చేయాలన్నారు. వాహనాలలో ప్రయాణించేటప్పుడు మద్యం సేవించడం, సెల్‌ఫోన్‌ చూడడం, నిద్రలేమి వంటి కారణాలతో డ్రైవింగ్‌ చేయడం వల్ల ప్రమాదాలకు గురవుతున్నారని, ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘించకూడదని చెప్పారు. డ్రైవర్ల నిర్లక్ష్యంతో ఎక్కువ శాతం ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు.WhatsApp Image 2026-01-13 at 18.14.51

About The Author