కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల కామారెడ్డి నియోజకవర్గ పర్యటన.
కామారెడ్డి,( భారత శక్తి ప్రతినిధి) జూన్ 25 :నరేంద్రమోదీ ప్రభుత్వం 9 యేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మహా జన్ సంపర్క అభియాన్ లో భాగంగా కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల కామారెడ్డి నియోజకవర్గ పర్యటనలో భాగంగా బిక్కనూరు మండల కేంద్రంలో పూర్వ బీజేపీ కార్యకర్తల సమావేశం రెడ్డి సంఘం భవనంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జనసంఘ్, బీజేపీలో పని చేసిన పూర్వ బీజేపీ కార్యకర్తలతో మాట్లాడిన అనంతరం జనసంఘ్ పార్టీ కాలం నుండీ బీజేపీ లో పని చేసిన సీనియర్ కార్యకర్తలను కేంద్ర మంత్రి సన్మానించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల మాట్లాడుతూ పార్టీ కోసం ఎలాంటి స్వార్థం లేకుండా జీవిత కాలం పని చేసిన ఎంతో మంది త్యాగాల వల్లనే ఈ రోజు పార్టీ దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో విస్తరించి సగానికి పైగా రాష్ట్రాల్లో అధికారంలో ఉండి కేంద్రంలో మూడో సారి అధికారం లోకి రాబోతోందని అన్నారు. పార్టీకి వారి సేవలు ఎప్పటికీ మరవలేనివి అని అన్నారు.ఈ కార్యక్రమంలో కామారెడ్డి నియోజకవర్గ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి, బీజేపీ నాయకులు ముఖ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి,( భారత శక్తి ప్రతినిధి) జూన్ 25 :నరేంద్రమోదీ ప్రభుత్వం 9 యేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మహా జన్ సంపర్క అభియాన్ లో భాగంగా కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల కామారెడ్డి నియోజకవర్గ పర్యటనలో భాగంగా బిక్కనూరు మండల కేంద్రంలో పూర్వ బీజేపీ కార్యకర్తల సమావేశం రెడ్డి సంఘం భవనంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జనసంఘ్, బీజేపీలో పని చేసిన పూర్వ బీజేపీ కార్యకర్తలతో మాట్లాడిన అనంతరం జనసంఘ్ పార్టీ కాలం నుండీ బీజేపీ లో పని చేసిన సీనియర్ కార్యకర్తలను కేంద్ర మంత్రి సన్మానించారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల మాట్లాడుతూ పార్టీ కోసం ఎలాంటి స్వార్థం లేకుండా జీవిత కాలం పని చేసిన ఎంతో మంది త్యాగాల వల్లనే ఈ రోజు పార్టీ దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో విస్తరించి సగానికి పైగా రాష్ట్రాల్లో అధికారంలో ఉండి కేంద్రంలో మూడో సారి అధికారం లోకి రాబోతోందని అన్నారు. పార్టీకి వారి సేవలు ఎప్పటికీ మరవలేనివి అని అన్నారు.ఈ కార్యక్రమంలో కామారెడ్డి నియోజకవర్గ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి, బీజేపీ నాయకులు ముఖ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
