అక్టోబర్ 31న సర్ధార్ వల్లభాయ్ 150 వ జయంతి సందర్భంగా కామారెడ్డిలో ఐక్యతా యాత్ర

Read More పేదలకు ఆరోగ్య భరోసా
Read More యువకులు క్రీడల్లో రాణించాలి
స్వాతంత్రం అనంతరం తెలంగాణాతో పాటు అనేక సంస్థానాలను భారత దేశంలో విలీనం కావడానికి ఆద్యుడు అయిన ఉక్కు మనిషి సర్ధార్ వల్లభాయ్ పటేల్ 150 వ జయంతి సందర్భంగా అక్టోబర్ 31 వ తేదీన ఉదయం 7 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం నుండి జన్మభూమి రోడ్డులోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వరకు ఐక్యతా యాత్ర నిర్వహించనున్నట్టు తెలియజేశారు.
కావున యువకులు జాతీయవాదులు, బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శిలు నరేందర్ రెడ్డి, రవీందర్ రావు, స్టేట్ కౌన్సిల్ సభ్యులు విపుల్ జైన్, అసెంబ్లీ కన్వీనర్ కుంటా లక్ష్మారెడ్డి, పట్టణ అధ్యక్షుడు మోటూరి శ్రీకాంత్, జిల్లా ఉపాధ్యక్షులు సంతోష్ రెడ్డి, బిజెవైఎమ్ అధ్యక్షుడు నంది వేణులు పాల్గొన్నారు.
About The Author
15 Nov 2025
