సావిత్రి భాయి పూలే సేవలు చిరస్మరణీయం : వశిష్ఠ విద్యా సంస్థల డైరెక్టర్ వి. సత్యనారాయణ గౌడ్.

ఉమ్మడి ఆదిలాబాద్ :
ప్రముఖ సంఘ సంస్కర్త, బాలికా విద్య కోసం పోరాడిన సావిత్రి భాయి పూలే జీవితం సదా చిరస్మరణీయమని వశిష్ఠ విద్యా సంస్థల డైరెక్టర్ వి. సత్యనారాయణ గౌడ్ అన్నారు. సావిత్రి పూలే జయంతిని పురస్కరించుకొని శనివారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని వశిష్ట డిగ్రీ, జూనియర్ కళాశాలల ఆధ్వర్యంలో జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. 18 వ శతాబ్దంలో బాలికలు, మహిళల విద్యా, హక్కుల కోసం కృషి చేశారని కొనియాడారు. ఆమె జీవిత విశేషాలను వివరించారు. అనంతరం డిగ్రీ, జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న మహిళా అధ్యాపకులను సన్మానించారు. కార్యక్రమంలో విద్యా సంస్థల కరెస్పాండెంట్ సరోత్తమ్ రెడ్డి, డిగ్రీ ప్రిన్సిపల్ డాక్టర్ అఖిలేశ్ కుమార్ సింగ్, వైస్ ప్రిన్సిపల్ శశిధర్, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ మహేష్ కుమార్,అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
