56 మంది పేద విద్యార్థిణిలకు స్కాలర్షిప్ అందించిన మలబార్ చారిటబుల్ ట్రస్ట్

56 మంది పేద విద్యార్థిణిలకు స్కాలర్షిప్ అందించిన మలబార్ చారిటబుల్ ట్రస్ట్

ఎల్బీనగర్:

మలబార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు ప్రధానం చేశారు. చిక్కడపల్లి ఆర్టీసీ కళాభవన్ లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో సరూర్నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న 56 మంది విద్యార్థిణిలు స్కాలర్షిప్ పొందారు.ఈ కార్యక్రమంలో మలబార్ యాజమాన్యంతో పాటు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు, వివిధ కళాశాలల ప్రిన్సిపాల్స్ , లెక్చరర్లు, అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. ఇందులో సరూర్నగర్ జూనియర్ కళాశాల నుండి 56 మంది విద్యార్థులు ప్రిన్సిపాల్  శ్రీమతి అనురాధ అలాగే కళాశాల అధ్యాపకులు మంజుల, నవీన్,శేఖరయ్య, అర్జున్ పాల్గొన్నారు. మలబార్ ట్రస్ట్ వారు పేద విద్యార్థులకు స్కాలర్షిప్లను ప్రధానం చేయడం చాలా సంతోషమని ఇది వారి విద్యార్థి జీవితంలో ముందుకు సాగడానికి ఎంతో తోడ్పడుతుందని కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు హర్షం వ్యక్తం చేశారు.

About The Author