గ్రామ పంచాయతీ, జిల్లా పరిషత్, మున్సిపల్ శాఖలకు వివిధ నిధులు..

పన్నులు, తదితర రూపేనా సమకూరే నిధులు, ఆదాయాన్ని పకడ్బందీగా వినియోగించుకోవాలి..  
వెల్లడించిన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.. 

WhatsApp Image 2025-11-10 at 7.53.30 PM

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా : 

Read More అంతర్జాతీయ మహిళలపై హింస నిర్మూలన దినోత్సవం

సోమవారం రాత్రి కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా పరిషత్, గ్రామ పంచాయతీ, మున్సిపల్ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆయా శాఖలకు వివిధ రూపాల్లో ప్రభుత్వాలు అందించే నిధులు, స్థానికంగా.. అద్దెలు, వివిధ పన్నులు, నిర్మాణ అనుమతుల ఫీజులు, లైసెన్సు ఫీజులు, నిర్మాణ అనుమతుల ఫీజులు, సంతలు, లే అవుట్లు, రిజిస్ట్రేషన్ లు, తదితర రూపాల్లో సమకూరిన నిధులు, వాటిలోంచి వినియోగించిన నిధుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వచ్చిన ప్రతి ఒక్క రూపాయిని, సమగ్రంగా ప్రజల సౌకర్యార్థం వినియోగించాలని అన్నారు. వివిధ రూపాల్లో శాఖలకు వచ్చే ఆదాయం పెంపుపై దృష్ట సారించాలని పేర్కొన్నారు. ప్రజలంతా నూతన నిర్మాణాలకు సంబంధించి అనుమతులు తప్పనిసరిగా పొందాలని తెలిపారు. 
      
ఈ సమావేశంలో జెడ్పీ సీఈవో గోవింద్, డిపిఓ శ్రీనివాస్, నిర్మల్, ఖానాపూర్ ల మున్సిపల్ కమిషనర్ లు జగదీశ్వర్ గౌడ్, సుందర్ సింగ్, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. 

Read More గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను లోటుపాట్లు లేకుండా పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.

About The Author