వేల కోట్ల రోడ్ల బడ్జెట్ ఏమైపోతోంది..?
- కాంగ్రెస్ పాలనలో గుంతలు రాజ్యం ఏలుతున్నాయి..
- సి ఆర్ ఎం పీ పేరుతో దోపిడీ జరుగుతోంది..
- హైదరాబాద్ రోడ్లు కాంగ్రెస్ వైఫల్యానికి సాక్ష్యం..
- ఇవి రోడ్లు కాదు, మరణపు ఉచ్చులు..
- ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ప్రభుత్వం.. !
- హైదరాబాద్ సైబర్ సిటీ కాదు.. ఇప్పుడు గుంతల నగరం.
- వేల కోట్ల రూపాయల రోడ్ల బడ్జెట్ ఉన్నా అభివృద్ధి సున్నా..
- రోడ్లు కనిపించడం లేదు.. గుంతలే కనిపిస్తున్నాయి..
- అభివృద్ధి లోపం కాదు.. పాలన వైఫల్యం కాదు.
- ఇది కాంగ్రెస్ ప్రభుత్వ నేరపూరిత నిర్లక్ష్యం..
- హైదరాబాద్ రోడ్ల దుస్థితిపై " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ " అందిస్తున్న ప్రత్యేక కథనం..

( స్పెషల్ కరస్పాండెంట్, హైదరాబాద్ )
హైదరాబాద్ నగర రోడ్లపై ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.. ప్రజల ప్రాణాలంటే లెక్కలేకుండా పోతోంది.. రోడ్లమీదకు వచ్చి ప్రయాణం చేయాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సి వస్తోంది.. ఇంటినుంచి బయలుదేరిన వ్యక్తి తిరిగి ఇంటికి వస్తాడో రాడో తెలియని పరిస్థితి వుంది.. రాంగ్ రూట్ అని ఇంకేదో అంటూ వేలకు వేలు వసూలు చేస్తున్న అధికారులకు, గుంతలు పడి ప్రమాదకరంగా మారిన నగర రోడ్లు కనిపించడం లేదా..? శుష్క వాగ్ధానాలు చేస్తున్న నాయకుల కళ్ళు మూసుకుని పోయాయా..? ప్రజలు కట్టే పన్నులతో కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్నా ఆ నిధులు ఏమైపోతున్నాయి..? ఎవరి బొక్కసాలు నిండుతున్నాయి..? గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలి.. సి ఆర్ ఎం పీ పేరుతో రోడ్లను చీల్చి, ప్రజల ప్రాణాలు తీస్తున్నారా? ఏమిటీ వైపరీత్యం..?
ఆటో, కార్లు తలకిందులయ్యే పరిస్థితులు.. అంబులెన్సులు ట్రాఫిక్‌లో చిక్కుకుని ప్రాణాలు పోతున్న దృశ్యాలు..
ఇదేనా కాంగ్రెస్ చెప్పిన “ప్రజా పాలన”?
నగరం మొత్తం గుంతల సమాధి :
వేల కోట్ల బడ్జెట్… పని మాత్రం శూన్యం! :
ప్రభుత్వ లెక్కల ప్రకారం హైదరాబాద్ రోడ్ల అభివృద్ధికి వేల కోట్ల రూపాయలు కేటాయించారు. అయితే ఆ డబ్బు ఎక్కడికి పోయింది?
ఎవరి జేబుల్లోకి వెళ్లింది? పనులు ఎందుకు నాణ్యత లేకుండా ఉన్నాయి? నెలకోసారి అదే రోడ్డు ఎందుకు తవ్వుతున్నారు? “రోడ్లు వేస్తున్నారా? లేక బిల్లులు రాస్తున్నారా?”
కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది… భద్రత మాత్రం లేదు.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. కానీ ప్రజల భద్రత మాత్రం రోడ్లపై కనిపించడం లేదు. ప్రతిరోజూ: రోడ్డు ప్రమాదాలు.. నడిచేవారికి గాయాలు.. వృద్ధులు, పిల్లలు రోడ్డుపై పడిపోతున్న దారుణ దృశ్యాలు
ఇవి సహజమా? లేదా పాలకుల నిర్లక్ష్య ఫలితమా? ఇది పరిపాలన కాదు… నిర్లక్ష్యానికి పరాకాష్ట.. ఇది అభివృద్ధి కాదు… ప్రజల ప్రాణాలతో చెలగాటం. ఎన్నికలప్పుడు రోడ్లు గుర్తొస్తాయి…అధికారంలోకి వచ్చాక గుంతలే గుర్తొస్తాయి. ఇది రాజకీయ విమర్శ కాదు. ఇది ప్రజల జీవన హక్కుపై జరుగుతున్న దాడి.
రోడ్డు నిర్మాణంలో అవినీతి :
నాణ్యత లోపం .. ప్రమాదాలు.. మరణాలు. ఈ పాపంలో బాధ్యత ఎవరిది? మంత్రి? మేయర్? కమిషనర్? లేక మొత్తం ప్రభుత్వం?
ప్రజల ప్రశ్నలకు సమాధానం ఎవరు చెబుతారు..? ఎప్పుడు చెబుతారు ? గుంతలపై ఎప్పుడు శాశ్వత పరిష్కారం? అవినీతిపై ఎప్పుడు విచారణ? బాధ్యులపై ఎప్పుడు చర్య? లేకపోతే చరిత్రలో ఈ ప్రభుత్వం ఇలా గుర్తుండిపోతుంది: వేల కోట్ల బడ్జెట్… గుంతల రాజ్యం కాంగ్రెస్ పాలన వైఫల్యానికి చిరునామాగా నిలిచిపోతుంది..
