గ్రామీణ జర్నలిస్టుల సంక్షేమానికి డబ్ల్యూజేఐ కృషి:రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావికంటి శ్రీనివాస్

కరీంనగర్, ఫిబ్రవరి 8(భారత శక్తి): పత్రికారంగం ఎంతగానో విస్తరించినప్పటికీ, గ్రామీణ జర్నలిస్టుల స్థితిగతుల్లో ఎలాంటి మార్పు లేకుండా పోయిందని వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూజేఐ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావికంటి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బీఎంఎస్ అనుబంధ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని లాంఛనంగా ఆయన ప్రారంభించారు. టీయూడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా కోశాధికారి గంగు సతీష్, సంయుక్త కార్యదర్శి దీకొండ అశోక్, కార్యవర్గ సభ్యుడు సిద్ధోజు ప్రశాంత్ లు ఆ యూనియన్ లో తమ పదవులకు రాజీనామా చేసి రావికంటి శ్రీనివాస్ సమక్షంలో డబ్ల్యూజేఐ లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ఒకటి రెండు ప్రధాన దినపత్రికలు మినహాయిస్తే, మెజారిటీ పత్రికలు గ్రామీణ జర్నలిస్టులకు లైన్ అకౌంట్లు కూడా ఇవ్వలేని దుస్థితి నెలకొని ఉందన్నారు. పనివేళలు, వేతనాలు లేని వ్యవస్థ జర్నలిజం రంగంలో కొనసాగుతుండడం దురదృష్టకరమన్నారు. గ్రామీణ జర్నలిస్టుల స్థితిగతులను అటు ప్రభుత్వాలు, ఇటు యాజమాన్యాలు విస్మరించాయని ఆయన ఆరోపించారు. గ్రామీణ జర్నలిస్టుల స్థితిగతుల్లో మార్పు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం, యాజమాన్యాలపై ఒత్తిడి పెంచాల్సిన బాధ్యత జర్నలిస్టు సంఘాలపై ఉందన్నారు. దురదృష్టవశాత్తు ఈ బాధ్యతను ఆయా సంఘాలు విస్మరించాయన్నారు. తాము గ్రామీణ జర్నలిస్టుల సంక్షేమానికి పాటుపడతామని తెలిపారు. క్రమశిక్షణ, విలువలు, జర్నలిస్టుల సంక్షేమం కోసం డబ్ల్యూజేఐ నిబద్ధతతో పనిచేస్తుందని యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాడూరు కరుణాకర్, కార్యదర్శి శివరాద్రి ప్రమోద్ కుమార్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా డబ్ల్యూజేఐకి జర్నలిస్టుల నుండి విశేష ఆదరణ లభిస్తోందని చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సంఘాన్ని శక్తివంతంగా తీర్చిదిద్దడానికి కృషి చేయాలని కోరారు. సభ్యత్వ నమోదు ప్రారంభ కార్యక్రమంలో బొడ్డు పరుశరాములు, కటకం సంతోష్, కంకణాల శ్రీనివాస్,అల్లె రమేష్, నాయిని బాబు, రాపల్లి భాస్కర్, బుస్స రామనాథం, ఆకునూరి శంకర్, మడుపు మేఘనాధ రెడ్డి, భాస్కర్, దొంతుల రాజేశం తదితరులు పాల్గొన్నారు.

గ్రామీణ జర్నలిస్టుల సంక్షేమానికి డబ్ల్యూజేఐ కృషి:రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావికంటి శ్రీనివాస్

కరీంనగర్, ఫిబ్రవరి 8(భారత శక్తి):

పత్రికారంగం ఎంతగానో విస్తరించినప్పటికీ, గ్రామీణ జర్నలిస్టుల స్థితిగతుల్లో ఎలాంటి మార్పు లేకుండా పోయిందని
వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూజేఐ)
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావికంటి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బీఎంఎస్ అనుబంధ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని లాంఛనంగా ఆయన ప్రారంభించారు.
టీయూడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా కోశాధికారి గంగు సతీష్, సంయుక్త కార్యదర్శి దీకొండ అశోక్, కార్యవర్గ సభ్యుడు సిద్ధోజు ప్రశాంత్ లు ఆ యూనియన్ లో తమ పదవులకు రాజీనామా చేసి రావికంటి శ్రీనివాస్ సమక్షంలో డబ్ల్యూజేఐ లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ఒకటి రెండు ప్రధాన దినపత్రికలు మినహాయిస్తే, మెజారిటీ పత్రికలు గ్రామీణ జర్నలిస్టులకు లైన్ అకౌంట్లు కూడా ఇవ్వలేని దుస్థితి నెలకొని ఉందన్నారు. పనివేళలు, వేతనాలు లేని వ్యవస్థ జర్నలిజం రంగంలో కొనసాగుతుండడం దురదృష్టకరమన్నారు. గ్రామీణ జర్నలిస్టుల స్థితిగతులను అటు ప్రభుత్వాలు, ఇటు యాజమాన్యాలు విస్మరించాయని ఆయన ఆరోపించారు.

గ్రామీణ జర్నలిస్టుల స్థితిగతుల్లో మార్పు

తీసుకువచ్చేందుకు ప్రభుత్వం, యాజమాన్యాలపై ఒత్తిడి పెంచాల్సిన బాధ్యత జర్నలిస్టు సంఘాలపై ఉందన్నారు. దురదృష్టవశాత్తు ఈ బాధ్యతను ఆయా సంఘాలు విస్మరించాయన్నారు. తాము గ్రామీణ జర్నలిస్టుల సంక్షేమానికి పాటుపడతామని తెలిపారు.
క్రమశిక్షణ, విలువలు, జర్నలిస్టుల సంక్షేమం కోసం డబ్ల్యూజేఐ నిబద్ధతతో పనిచేస్తుందని యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాడూరు కరుణాకర్, కార్యదర్శి శివరాద్రి ప్రమోద్ కుమార్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా డబ్ల్యూజేఐకి జర్నలిస్టుల నుండి విశేష ఆదరణ లభిస్తోందని చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సంఘాన్ని శక్తివంతంగా తీర్చిదిద్దడానికి కృషి చేయాలని కోరారు.

సభ్యత్వ నమోదు ప్రారంభ కార్యక్రమంలో బొడ్డు పరుశరాములు, కటకం సంతోష్, కంకణాల శ్రీనివాస్,అల్లె రమేష్, నాయిని బాబు, రాపల్లి భాస్కర్, బుస్స రామనాథం, ఆకునూరి శంకర్, మడుపు మేఘనాధ రెడ్డి, భాస్కర్, దొంతుల రాజేశం తదితరులు పాల్గొన్నారు.

About The Author