గాలి నాణ్యతా ప్రమాణాలను పెంపొందించాలి: జిల్లా కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి
కడప,ఫిబ్రవరి 1,(భారత శక్తి ): కడప నగరంలో గాలి నాణ్యతా ప్రమాణాలను పెంపొందించేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో “నేషనల్ క్లీన్ ఎయిర్” కార్యక్రమం పై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నగరంలో గాలి నాణ్యత ప్రమాణాలను పెంపొందించేందుకు చర్యలు చేపట్టాలని, అందుకు సంబంధించి కేంద్రీయ కాలుష్య నియంత్రణ మండలి సూచించిన ఆదేశాలను పాటిస్తూ కార్యాచరణ చేపట్టాలన్నారు. నగరంలో రోడ్లకు ఇరుప్రక్కల విస్తృతంగా మొక్కలను నాటి పచ్చదనాన్ని పెంపొందించాలన్నారు. గాలిలో ధూళి కణాలు లేకుండా ప్రజలు స్వచ్ఛమైన ప్రాణ వాయువును స్వేచ్ఛగా పీల్చుకునేలా చూడాలన్నారు. నగరంలో ట్రాఫిక్ సిగ్నల్స్, సూచిక బోర్డులను ఏర్పాటు చేసి వాహనాల రద్దీని అరికడుతూ శబ్ద, వాయు కాలుష్యాన్ని నియంత్రించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మనోజ్ రెడ్డి, జిల్లా కాలుష్య నియంత్రణ ప్రాంతీయ అధికారి సుధ కురబ,ఏ ఈ అనిల్ కుమార్ రెడ్డి, జీఎం డిఐసి చంద్ బాషా, జిల్లా వ్యవసాయ అధికారి నాగేశ్వర రావు, డీఎస్ఓ,మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ చెన్నకేషవ రెడ్డి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కడప,ఫిబ్రవరి 1,(భారత శక్తి ): కడప నగరంలో గాలి నాణ్యతా ప్రమాణాలను పెంపొందించేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి సంబంధిత అధికారులను ఆదేశించారు.
కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో “నేషనల్ క్లీన్ ఎయిర్” కార్యక్రమం పై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నగరంలో గాలి నాణ్యత ప్రమాణాలను పెంపొందించేందుకు చర్యలు చేపట్టాలని, అందుకు సంబంధించి కేంద్రీయ కాలుష్య నియంత్రణ మండలి సూచించిన ఆదేశాలను పాటిస్తూ కార్యాచరణ చేపట్టాలన్నారు. నగరంలో రోడ్లకు ఇరుప్రక్కల విస్తృతంగా మొక్కలను నాటి పచ్చదనాన్ని పెంపొందించాలన్నారు. గాలిలో ధూళి కణాలు లేకుండా ప్రజలు స్వచ్ఛమైన ప్రాణ వాయువును స్వేచ్ఛగా పీల్చుకునేలా చూడాలన్నారు. నగరంలో ట్రాఫిక్ సిగ్నల్స్, సూచిక బోర్డులను ఏర్పాటు చేసి వాహనాల రద్దీని అరికడుతూ శబ్ద, వాయు కాలుష్యాన్ని నియంత్రించాలన్నారు.
