ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై అవగాహన సదస్సు* ఇంటింటి సర్వేలో బీఎల్‌ఓలు, బీఎల్‌ఏలు సమన్వయంతో పనిచేయాలి: డిప్యూటీ కమిషనర్ వి. సమ్మయ్య

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై అవగాహన సదస్సు* ఇంటింటి సర్వేలో బీఎల్‌ఓలు, బీఎల్‌ఏలు సమన్వయంతో పనిచేయాలి: డిప్యూటీ కమిషనర్ వి. సమ్మయ్య

బడంగ్‌పేట్:

కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపట్టనున్న ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమంలో భాగంగా బూత్ లెవల్ అధికారులు (BLO), బూత్ లెవల్ ఏజెంట్ల (BLA) అవగాహన సదస్సు మంగళవారం బడంగ్‌పేట్ సర్కిల్-16 కార్యాలయం ఎదురుగా ఉన్న ప్రజాభవన్‌లో జరిగింది. జూన్ 25 నుండి ప్రారంభం కానున్న ఇంటింటి ఓటర్ల సర్వే  నిర్వహణపై ఈ సమావేశంలో దిశానిర్దేశం చేశారు.

*ఓటరు జాబితా నాణ్యతపై ప్రత్యేక దృష్టి
ఈ సదస్సులో ఓటరు జాబితా మ్యాపింగ్, ప్రోజెనీ మ్యాపింగ్, కొత్త ఓటర్ల నమోదు, మరణించిన, వలస వెళ్లిన మరియు డూప్లికేట్ ఓటర్ల వివరాల పరిశీలన వంటి కీలక అంశాలపై సిబ్బందికి అవగాహన కల్పించారు. ఖచ్చితమైన, పారదర్శకమైన ఓటరు జాబితా తయారీలో బూత్ లెవల్ ఏజెంట్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అధికారులు సూచించారు.

*నిబంధనల ప్రకారం సర్వే పూర్తి చేయాలి: డిప్యూటీ కమిషనర్
సమావేశంలో బడంగ్‌పేట్ డిప్యూటీ కమిషనర్/AERO వి. సమ్మయ్య మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఎస్‌ఐఆర్ (SIR) కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. ఓటర్ల ముసాయిదా జాబితా తయారీతో పాటు అర్హులైన వారి నుంచి ఫారం 6, 7, 8 దరఖాస్తులను సేకరించడంలో బీఎల్‌ఓలకు, బీఎల్‌ఏలు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఓటరు జాబితా నాణ్యతను మెరుగుపరచడంలో ఏజెంట్ల పాత్ర అత్యంత కీలకమని స్పష్టం చేశారు.
ఈ అవగాహన కార్యక్రమంలో ఎలక్షన్ మాస్టర్ ట్రైనర్ ప్రతాప్ రెడ్డి, బీఎల్‌ఓలు, బీఎల్‌ఓ సూపర్‌వైజర్లు, వివిధ రాజకీయ పార్టీల బూత్ లెవల్ ఏజెంట్లు పాల్గొన్నారు.WhatsApp Image 2026-06-23 at 20.27.37

About The Author