ఫిబ్రవరి 10 నుండి ఫిబ్రవరి 24 వరకు ఇంటింటి న్యాయ ప్రచారం
కడప, భారత శక్తి ప్రతినిధి, ఫిబ్రవరి 07: జాతీయ న్యాయ సేవాధికార సంస్థ న్యూఢిల్లీ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ అమరావతి వారి ఆదేశానుసారంగా శ్రీమతి జి.శ్రీదేవి, చైర్మన్-కం-జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ, కడప వారి సూచనల మేరకు శ్రీ ఎస్.బాబా ఫక్రుద్దీన్, సెక్రటరీ-కం-సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, కడప వారు రిమ్స్ ఆవరణలో గల “జిల్లా సత్వర చికిత్స కేంద్రము ను టీం సభ్యులతో విజిట్ చేసి న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా మాట్లాడుతూ పుట్టినప్పటి నుండి 18 సంవత్సరాల లోపు గల పిల్లలకు పుట్టుకతో వచ్చే ఎదుగుదల లోపాలకు సంబంధించిన పిల్లల తల్లిదండ్రులు ఇలాంటి చికిత్స సెంటర్లను సద్వినియోగం చేసుకోవాలి, ఇందుకోసం గౌరవ జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఇంటింటి ప్రచారాన్ని ఫిబ్రవరి 10వ తేదీ నుండి ఫిబ్రవరి 24వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. ఈ ఇంటింటి ప్రచారంలో గౌరవ జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ వారు 11 టీంలను ఏర్పాటు చేయడం జరిగినది. ఇందులో ప్యానల్ న్యాయవాదులు పారా లీగల్ వాలంటరీలు ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు అంగన్వాడి వర్కర్లు వైద్యాధికారులు భవితా సెంటర్ నిర్వాహకులు మొదలైన వారు పాల్గొంటారు. “కడప రిమ్స్ ఆవరణంలో గల జిల్లా సత్వర చికిత్స కేంద్రము / జిల్లా బాల భవిత కేంద్రము ఎన్నో సదుపాయాలు గల ఈ సెంటర్ ను సద్వినియోగం చేసుకోవాలి, ప్రత్యేక పిల్లల పట్ల తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలి, ప్రస్తుత సమాజంలో ప్రత్యేక పిల్లలు కూడా ఉన్నత స్థానాలను అధిరోహిస్తున్నారు, వీరి కోసం గౌరవ జాతీయ న్యాయ సేవ అధికార సంస్థ జాతీయ న్యాయ సేవాధికార సంస్థ (నల్సా) వారి బాలల సంరక్షణ కొరకు స్నేహపూర్వక న్యాయ సేవలు పథకం 2024, జాతీయ న్యాయ సేవ అధికార సంస్థ (నల్సా) వారి మానసిక అనారోగ్యం ఉన్న వ్యక్తులు మరియు మేధో వైకల్యాలున్న వ్యక్తులకు చట్టపరమైన సేవలు పథకం 2024 పథకములను ప్రవేశపెట్టినది, సద్వినియోగం చేసుకోవాలి, వికలాంగుల హక్కుల చట్టం 2016, మానసిక ఆరోగ్యం సంరక్షణ చట్టం 2017, జాతీయ మానసిక ఆరోగ్య విధానం 2014, లీగల్ సర్వీసెస్ హెల్ప్ లైన్ నెంబర్ 15100, చైల్డ్ లైన్ హెల్ప్లైన్ నెంబర్ 1098, దివ్యాంగజన్ హెల్ప్ లైన్ నెంబర్ 14456, ఉచిత న్యాయ సహాయము మొదలగు అంశాలను వివరించారు. ఈ కార్యక్రమంలో కడప మరియు ప్రొద్దుటూరు డిస్టిక్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ అధికారి శ్రీరమేష్, ప్రోగ్రాం మేనేజర్ శ్రీ నవీన్ కుమార్, పీడియాట్రిక్ డాక్టర్ శ్రీమతి విష్ణు వందన, వైద్యులు సిబ్బంది, పానల్ న్యాయవాదులు మరియు పారా లీగల్ వాలంటీర్లు పాల్గొన్నారు.