పర్యావరణ సహితంగా యురేనియం ప్రాజెక్ట్ ను నిర్వహించండి:జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి
వైయస్సార్ జిల్లా : పర్యావరణ సహితంగా యురేనియం (యు సి ఐ ఎల్) ప్రాజెక్టు ను నిర్వహించాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. బుధవారం వేముల మండలం తుమ్మలపల్లి యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(యు.సి.ఐ ఎల్) ప్రాజెక్టును జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సందర్శించి సంబంధిత అధికారులతో ప్రాజెక్ట్ పనులు, ఉత్పత్తులు, ఇతర అంశాలు పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి మాట్లాడుతూ… గనుల్లో ఎలాంటి ప్రమాదాలు తలెత్తకుండా భద్రత ప్రామాణాలను పాటించాలన్నారు.ప్రాజెక్టు నిర్వహణ, భద్రతాపరమైన అంశాల్లో ఎలాంటి అలసత్వం వహించారాదన్నారు. ప్లాంటేషన్( మొక్కల పెంపకం) కార్యక్రమాన్ని ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చేపట్టాలని అటవీశాఖ అధికారులను ఆదేశించారు.యురేనియం గనుల వల్ల పరిసర గ్రామాలు ప్రభావితం కాకుండా చూడాలన్నారు.అలాగే జిల్లా విపత్తు నిర్వహణ కమిటీతో సమన్వయం చేసుకుంటూ మాక్ డ్రిల్ లు నిర్వహించాలని అధికారులకు సూచించారు. మొదట యు.సి.ఐ.ఎల్ అధికారులు ప్రాజెక్టు పై పిపిటీ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా కలెక్టర్ కు వివరించారు. యురేనియం ప్రాజెక్టుకు ఏ పల్లెలు దగ్గరగా ఉన్నాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు.యురేనియం ప్రాజెక్టు (టైలింగ్) వ్యర్థపదార్థాల నిల్వలు, స్టోరేజ్ సామర్థ్యం వంటి అంశాలపై ఆరా తీశారు.300 ఎకరాలలో తుమ్మలపల్లి వ్యాలీలో నూతన వ్యర్థపదార్థాల స్టోరేజ్ ప్రాంతాన్ని గుర్తించినట్లు కలెక్టర్ కు తెలుపగా ఇప్పటినుంచే సర్వే పనులు మొదలుపెట్టి అందుకు సంబంధించిన పనులు పూర్తి చేయాలన్నారు.రోజుకు ఎన్ని టన్నుల యురేనియం ఉత్పత్తి అవుతుందని అధికారులు అడిగి తెలుసుకున్నారు.అలాగే గనుల్లో ఎంతమంది సిబ్బంది పనిచేస్తున్నారు. ఎన్ని షిఫ్ట్ లు నిర్వహిస్తున్నారని అధికారులు అడిగి తెలుసుకున్నారు.వెంటిలేషన్,హానికర వాయువులు, అంబులెన్స్ తదితర అంశాలపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ ఎం. శ్రీనివాసుల రావు,యుసీఐఎల్ అధికారులు సుమన్ సర్కార్, కిషోర్ భగత్, శ్రీకాంత్, మాతి వన్నన్ సంజయ్ చటర్జీ, పులివెందుల ఆర్డిఓ చిన్నయ్య , ఆర్ అండ్ బి డిఈ మాధవి, రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులు,తదితరులు పాల్గొన్నారు.
వైయస్సార్ జిల్లా : పర్యావరణ సహితంగా యురేనియం (యు సి ఐ ఎల్) ప్రాజెక్టు ను నిర్వహించాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు.
బుధవారం వేముల మండలం తుమ్మలపల్లి యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(యు.సి.ఐ ఎల్) ప్రాజెక్టును జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సందర్శించి సంబంధిత అధికారులతో ప్రాజెక్ట్ పనులు, ఉత్పత్తులు, ఇతర అంశాలు పై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి మాట్లాడుతూ… గనుల్లో ఎలాంటి ప్రమాదాలు తలెత్తకుండా భద్రత ప్రామాణాలను పాటించాలన్నారు.ప్రాజెక్టు నిర్వహణ, భద్రతాపరమైన అంశాల్లో ఎలాంటి అలసత్వం వహించారాదన్నారు. ప్లాంటేషన్( మొక్కల పెంపకం) కార్యక్రమాన్ని ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చేపట్టాలని అటవీశాఖ అధికారులను ఆదేశించారు.యురేనియం గనుల వల్ల పరిసర గ్రామాలు ప్రభావితం కాకుండా చూడాలన్నారు.అలాగే జిల్లా విపత్తు నిర్వహణ కమిటీతో సమన్వయం చేసుకుంటూ మాక్ డ్రిల్ లు నిర్వహించాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ ఎం. శ్రీనివాసుల రావు,యుసీఐఎల్ అధికారులు సుమన్ సర్కార్, కిషోర్ భగత్, శ్రీకాంత్, మాతి వన్నన్ సంజయ్ చటర్జీ, పులివెందుల ఆర్డిఓ చిన్నయ్య , ఆర్ అండ్ బి డిఈ మాధవి, రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులు,తదితరులు పాల్గొన్నారు.
