వేసవిలో నీటి అవసరాలపై ప్రత్యేక దృష్టి: జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి

కడప, ఫిబ్రవరి 7(భారత శక్తి ) : వేసవిలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నీటి అవసరాలపై ప్రత్యేక దృష్టి సారించి.. తాగునీటి కొరత లేకుండా ముందస్తు ప్రణాళికలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ బోర్డు మీటింగ్ హాలులో.. వేసవిలో పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో తాగునీటి అవసరాల సన్నద్ధతపై సంబంధిత మున్సిపల్, ఇంజనీరింగ్ అధికారులతో జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వేసవిని దృష్టిలో ఉంచుకుని పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని అన్ని ప్రాంతాలకు ఎలాంటి కొరత లేకుండా తాగునీటి సదుపాయం, అలాగే గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు నీటి కొరత లేకుండా ముందస్తు ఏర్పాట్లు సిద్ధం చేయాలన్నారు. మార్చి 20వ తేదీ లోపు పులివెందుల పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని ప్రాంతాల్లో సమృద్ధిగా తాగునీరు అందేలా పెండింగ్ లో ఉన్న తాగునీటి సరఫరా పనులను పూర్తి చేయాలన్నారు. అందుకు సంబంధించి చేపట్టాల్సిన పనులకు ప్రతిపాదనలను అందజేసి త్వరితగతిన పనులను పూర్తి చేయాలన్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా అధిక నీటి ఎద్దడి పరిస్థితులు లేకపోయినప్పటికీ ఈ వేసవిలో అన్ని గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి అవసరాలకు సరిపడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు సంబంధించి ప్రణాళికలను రూపొందించాలని ఆర్ డబ్ల్యూ ఎస్ ఇంజినీరింగ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పట్టణ, ప్రాంతాల్లో తాగునీటి అవసరాలతో పాటు రూరల్ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు. జల్ జీవన్ మిషన్ ద్వారా చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుండి పులివెందుల మున్సిపాలిటీకి తాగునీరందించే పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పులివెందుల ఆర్డీవో చిన్నయ్య, ఆర్ డబ్ల్యుఎస్ ఎస్ఈ వీరన్న, ఈఈ విజయ్ భాస్కర్, పులివెందుల మున్సిపల్ కమిషనర్ రాముడు, ఈ ఈ చిదానంద రెడ్డి, పబ్లిక్ హెల్త్ ఈఈ రమణమూర్తి తదితరులు పాల్గోన్నారు.

వేసవిలో నీటి అవసరాలపై ప్రత్యేక దృష్టి: జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి

కడప, ఫిబ్రవరి 7(భారత శక్తి ) : వేసవిలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నీటి అవసరాలపై ప్రత్యేక దృష్టి సారించి.. తాగునీటి కొరత లేకుండా ముందస్తు ప్రణాళికలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి సంబంధిత అధికారులను ఆదేశించారు.

శుక్రవారం కలెక్టరేట్ బోర్డు మీటింగ్ హాలులో.. వేసవిలో పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో తాగునీటి అవసరాల సన్నద్ధతపై సంబంధిత మున్సిపల్, ఇంజనీరింగ్ అధికారులతో జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి సమీక్షించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వేసవిని దృష్టిలో ఉంచుకుని పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని అన్ని ప్రాంతాలకు ఎలాంటి కొరత లేకుండా తాగునీటి సదుపాయం, అలాగే గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు నీటి కొరత లేకుండా ముందస్తు ఏర్పాట్లు సిద్ధం చేయాలన్నారు.

మార్చి 20వ తేదీ లోపు పులివెందుల పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని ప్రాంతాల్లో సమృద్ధిగా తాగునీరు అందేలా పెండింగ్ లో ఉన్న తాగునీటి సరఫరా పనులను పూర్తి చేయాలన్నారు. అందుకు సంబంధించి చేపట్టాల్సిన పనులకు ప్రతిపాదనలను అందజేసి త్వరితగతిన పనులను పూర్తి చేయాలన్నారు.

ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా అధిక నీటి ఎద్దడి పరిస్థితులు లేకపోయినప్పటికీ ఈ వేసవిలో అన్ని గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి అవసరాలకు సరిపడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు సంబంధించి ప్రణాళికలను రూపొందించాలని ఆర్ డబ్ల్యూ ఎస్ ఇంజినీరింగ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పట్టణ, ప్రాంతాల్లో తాగునీటి అవసరాలతో పాటు రూరల్ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు. జల్ జీవన్ మిషన్ ద్వారా చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుండి పులివెందుల మున్సిపాలిటీకి తాగునీరందించే పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో పులివెందుల ఆర్డీవో చిన్నయ్య, ఆర్ డబ్ల్యుఎస్ ఎస్ఈ వీరన్న, ఈఈ విజయ్ భాస్కర్, పులివెందుల మున్సిపల్ కమిషనర్ రాముడు, ఈ ఈ చిదానంద రెడ్డి, పబ్లిక్ హెల్త్ ఈఈ రమణమూర్తి తదితరులు పాల్గోన్నారు.

About The Author

Related Posts