బస్టాండ్‌లో… పట్టపగలు విద్యార్థి హత్య

పెరంబూర్‌(చెన్నై): బస్టాండ్‌లో నిల్చున్న ప్లస్‌ టూ విద్యార్థిని హత్యచేసి పరారైన నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కడలూరు జిల్లా శ్రీముష్ణం సమీపం మేల్‌పులియాంగుడికి చెందిన జీవా (17) ప్లస్‌ టూ చదువుతున్నాడు. మంగళవారం ఉదయం పాఠశాలకు వెళ్లేందుకు బస్టాండ్‌లో నిల్చుని ఉన్న సమయంలో, అదే గ్రామానికి చెందిన ఆనంద్‌ (27) అతని వద్దకు వచ్చి ఊహించని విధంగా కత్తితో తీవ్రంగా దాడిచేశాడు. ఈ ఘటనలో తీవ్రగాయాలతో జీవా సంఘటనా స్థలంలోనే మృతిచెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, హత్యకు పాత కక్షలు కారణమా? ప్రేమ వ్యవహారమా? అనే కోణాల్లో విచారణ జరుపుతున్నారు. ఇక పరారైన ఆనంద్‌ కోసం గాలిస్తున్నారు. కాగా, ఆనంద్‌ విద్యుత్‌ బోర్డులో తాత్కాలిక ఉద్యోగి.

About The Author

Related Posts