మైనంపల్లి రాకతో ఆసక్తికరం

మెదక్‌, సెప్టెంబర్‌ 30 మైనంపల్లి రాకతో మెదక్‌ కాంగ్రెస్‌ రాజకీయం ఆసక్తికరంగా మారింది. రోహిత్‌ బరిలో ఉండటం ఖాయంగానే కనిపిస్తోంది. దీంతో స్థానిక కాంగ్రెస్‌ నేతలు మైనంపల్లికి మద్దతుగా నిలుస్తారా..? లేదా..? అనేది టాక్‌ ఆఫ్‌ ది మెదక్‌ గా మారింది.కాంగ్రెస్‌ లో మైనంపల్లి చేరికతో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. మల్కాజ్‌ గిరి నుంచి హన్మంతరావు, ఆయన కుమారుడు మైనంపల్లి రోహిత్‌ మెదక్‌ నుంచి పోటీలో ఉండటం ఖాయంగా మారింది. ఇద్జరికి టికెట్లు ఇచ్చేందుకు? హైకమాండ్‌ కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వటంతో స్థానిక నేతలను నిరాశలోకి నెట్టిసినట్లు అయింది. కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు కంఠరెడ్డి తిరుపతి రెడ్డి మెదక్‌ అభ్యర్థిగా తానే ఉంటానని చెబుతూ వస్తున్నారు. గత ఐదేళ్లుగా నియోజకవర్గ వ్యాప్తంగా తిరుగుతూ ప్రజా సమస్యలను లేవనెత్తడంలో పార్టీ తరపున కీలకపాత్ర పోషించానని అంటున్నారు.పార్టీలో ఎప్పడి నుండో ఉన్న నాయకులను పక్కనపెట్టి? కొత్తగా పార్టీలోకి వచ్చిన నేతలకు టికెట్లు ఇస్తే స్థానిక నేతలు ఎలా కలిసిపోతారనేది మెదక్‌ లో ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్‌ పార్టీ నుంచి 2004 లో ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్‌ నాయకుడు పట్లోళ్ల శశిధర్‌ రెడ్డి? 2009 ఎన్నికల్లో మైనంపల్లి హనుమంత రావు(టీడీపీ) చేతిలో ఓడిపోయారు.2014 లో, 2018 లో కూడా శశిధర్‌ రెడ్డి కి వేరు వేరు కారణాల రీత్యా టికెట్‌ రాకపోవడంతో? చాలా రోజుల నుంచి శశిధర్‌ రెడ్డి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఇలాంటి పరిణామాల మధ్యలో? కాంగ్రెస్‌ పార్టీ కి మెదక్‌ లో సరైన అభ్యర్థి లేకపోవడంతో తిరిగి మళ్లీ శశిధర్‌ రెడ్డిని యాక్టివ్‌ చేశారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి. పార్టీ టికెట్‌ పై కూడా హావిూ ఇచ్చారని శశిధర్‌ రెడ్డి వర్గీయులు చెబుతున్నారు. వీరే కాకుండా? మ్యడం బాలకృష్ణతో పాటు మిగతా లీడర్లు కూడా మెదక్‌ టికెట్‌ ను ఆశిస్తున్నారు. అయితే వీరంతా? రోహిత్‌ కు టికెట్‌ ఇస్తే మద్దతుగా నిలుస్తారా లేదా అనేది పెద్ద ప్రశ్నగా మారింది.మెదక్‌ సీటు నుంచి మైనంపల్లి తెలుగుదేశం పార్టీ తరపున ఇంతకుముందు రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ సమయంలో కాంగ్రెస్‌ పార్టీ వారితో ఎప్పుడు కూడా ఒక ప్రతిపక్ష పార్టీ లీడర్‌ లాగానే సంబంధం కలిగి ఉన్నారు. మెదక్‌ నియోజకవర్గంలోని కాంగ్రెస్‌ కేడర్‌ అంతా కూడా మైనంపల్లిని ప్రత్యర్థి వర్గంగానే భావించేది. అలాంటి వ్యక్తికి మెదక్‌ టికెట్‌ దక్కితే? కేడర్‌ ఎలా పని చేస్తుందనేది కూడా ఆసక్తికరంగా మారింది. మైనంపల్లి హన్మంతరావు బరిలో ఉండకుండా ?రాజకీయ అనుభవం లేని ఆయన కుమారుడు రోహిత్‌ తో ఎలా కలిసి పని చేస్తామనే వాదనను కూడా నియోజకవర్గ నేతలు తెరపైకి తీసుకువస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ జిల్లా ప్రెసిడెంట్‌ తిరుపతి రెడ్డి మాత్రం? తనకు టికెట్‌ ఇవ్వకపోతే కార్యకర్తలతో చర్చింతి ఒక నిర్ణయం తీసుకుంటాని ప్రకటించారు

మైనంపల్లి  రాకతో ఆసక్తికరం

మెదక్‌, సెప్టెంబర్‌ 30
మైనంపల్లి రాకతో మెదక్‌ కాంగ్రెస్‌ రాజకీయం ఆసక్తికరంగా మారింది. రోహిత్‌ బరిలో ఉండటం ఖాయంగానే కనిపిస్తోంది. దీంతో స్థానిక కాంగ్రెస్‌ నేతలు మైనంపల్లికి మద్దతుగా నిలుస్తారా..? లేదా..? అనేది టాక్‌ ఆఫ్‌ ది మెదక్‌ గా మారింది.కాంగ్రెస్‌ లో మైనంపల్లి చేరికతో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. మల్కాజ్‌ గిరి నుంచి హన్మంతరావు, ఆయన కుమారుడు మైనంపల్లి రోహిత్‌ మెదక్‌ నుంచి పోటీలో ఉండటం ఖాయంగా మారింది. ఇద్జరికి టికెట్లు ఇచ్చేందుకు? హైకమాండ్‌ కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వటంతో స్థానిక నేతలను నిరాశలోకి నెట్టిసినట్లు అయింది. కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు కంఠరెడ్డి తిరుపతి రెడ్డి మెదక్‌ అభ్యర్థిగా తానే ఉంటానని చెబుతూ వస్తున్నారు. గత ఐదేళ్లుగా నియోజకవర్గ వ్యాప్తంగా తిరుగుతూ ప్రజా సమస్యలను లేవనెత్తడంలో పార్టీ తరపున కీలకపాత్ర పోషించానని అంటున్నారు.పార్టీలో ఎప్పడి నుండో ఉన్న నాయకులను పక్కనపెట్టి? కొత్తగా పార్టీలోకి వచ్చిన నేతలకు టికెట్లు ఇస్తే స్థానిక నేతలు ఎలా కలిసిపోతారనేది మెదక్‌ లో ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్‌ పార్టీ నుంచి 2004 లో ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్‌ నాయకుడు పట్లోళ్ల శశిధర్‌ రెడ్డి? 2009 ఎన్నికల్లో మైనంపల్లి హనుమంత రావు(టీడీపీ) చేతిలో ఓడిపోయారు.2014 లో, 2018 లో కూడా శశిధర్‌ రెడ్డి కి వేరు వేరు కారణాల రీత్యా టికెట్‌ రాకపోవడంతో? చాలా రోజుల నుంచి శశిధర్‌ రెడ్డి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఇలాంటి పరిణామాల మధ్యలో? కాంగ్రెస్‌ పార్టీ కి మెదక్‌ లో సరైన అభ్యర్థి లేకపోవడంతో తిరిగి మళ్లీ శశిధర్‌ రెడ్డిని యాక్టివ్‌ చేశారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి. పార్టీ టికెట్‌ పై కూడా హావిూ ఇచ్చారని శశిధర్‌ రెడ్డి వర్గీయులు చెబుతున్నారు. వీరే కాకుండా? మ్యడం బాలకృష్ణతో పాటు మిగతా లీడర్లు కూడా మెదక్‌ టికెట్‌ ను ఆశిస్తున్నారు. అయితే వీరంతా? రోహిత్‌ కు టికెట్‌ ఇస్తే మద్దతుగా నిలుస్తారా లేదా అనేది పెద్ద ప్రశ్నగా మారింది.మెదక్‌ సీటు నుంచి మైనంపల్లి తెలుగుదేశం పార్టీ తరపున ఇంతకుముందు రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ సమయంలో కాంగ్రెస్‌ పార్టీ వారితో ఎప్పుడు కూడా ఒక ప్రతిపక్ష పార్టీ లీడర్‌ లాగానే సంబంధం కలిగి ఉన్నారు. మెదక్‌ నియోజకవర్గంలోని కాంగ్రెస్‌ కేడర్‌ అంతా కూడా మైనంపల్లిని ప్రత్యర్థి వర్గంగానే భావించేది. అలాంటి వ్యక్తికి మెదక్‌ టికెట్‌ దక్కితే? కేడర్‌ ఎలా పని చేస్తుందనేది కూడా ఆసక్తికరంగా మారింది. మైనంపల్లి హన్మంతరావు బరిలో ఉండకుండా ?రాజకీయ అనుభవం లేని ఆయన కుమారుడు రోహిత్‌ తో ఎలా కలిసి పని చేస్తామనే వాదనను కూడా నియోజకవర్గ నేతలు తెరపైకి తీసుకువస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ జిల్లా ప్రెసిడెంట్‌ తిరుపతి రెడ్డి మాత్రం? తనకు టికెట్‌ ఇవ్వకపోతే కార్యకర్తలతో చర్చింతి ఒక నిర్ణయం తీసుకుంటాని ప్రకటించారు

About The Author

Related Posts