కాంగ్రెస్ శ్రేణుల దాడిని నిరసిస్తూ ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
కరీంనగర్, భారత శక్తి బిజెపి రాష్ట్ర కార్యాలయం పై కాంగ్రెస్ శ్రేణులు దాడి చేయడం పట్ల కరీంనగర్ జిల్లా బిజెపి శ్రేణులు భగ్గుమన్నారు. మంగళవారం నగరంలోని కోర్టు చౌరస్తాలో నిరసనగా రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బిజెపి కరీంనగర్ పార్లమెంటు కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావ్ మాట్లాడుతూ బిజెపి రాష్ట్ర కార్యాలయం పై దాడి చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నమని, దాడిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రౌడీయిజాన్ని, దౌర్జన్యాలను వారే పెంచి పోషిస్తున్నట్లేనన్నారు. దాడుల సంస్కృతి సమంజసం కాదని, చట్ట వ్యతిరేక పనులను కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించడం మూర్ఖత్వం చర్య అన్నారు.ఎవరైనా తప్పుడు వ్యాఖ్యలు చేసినట్లయితే ప్రజాస్వామ్య బద్దంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉందని , అవసరమైతే చట్టపరంగా కూడా శిక్షించవచ్చన్నారు. రాష్ట్రంలో అధికారం చేతిలో ఉందని చట్టాన్ని చేతిలోకితీసుకొని భయభ్రాంతులకు గురి చేస్తూ, కార్యాలయాల పైన దాడులకు తెగబడడాన్ని దుర్మార్గమైన చర్యగా భావిస్తున్నామని తెలిపారు. గురుకుల విద్యార్థులను పరామర్శించిన బిజెపి శ్రేణులుకరీంనగర్ పట్టణం శర్మానగర్లోని మహాత్మా జ్యోతిబాఫూలే గురుకుల పాఠశాలలోని 23 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని మంగళవారం బిజెపి పార్టీ నాయకులు ఆసుపత్రికి తరలి వెళ్లారు. ఈ సందర్భంగా విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని, ఫుడ్ పాయిజన్ గల కారణాలను వైద్యులనుఅడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్యాలతో జీవితాలతోచెలగాటమాడుతుందని అనునిత్యం రాష్ట్రంలోని ఎక్కడో ఒకచోట ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వం తగిన నివారణ చర్యలు చేపట్టడం లేదని బిజెపి నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు వంగల పవన్, కొలగని శ్రీనివాస్, కటకం లోకేష్, నాగసముద్రం ప్రవీణ్, శివారెడ్డి, పాదం శివరాజు, కరండ్ల రతన్ , సంతోష్, ఓదెలు, నాంపల్లి శ్రీనివాస్, చడా ఆనంద్, మాసం గణేష్, పొన్నం మొండన్న , బండారు గాయత్రి, సత్యనారాయణ, కేంచ శేఖర్, ఉప్పరపెల్లి శ్రీనివాస్, శ్రీరాముల శ్రీకాంత్, ఈస్సాపెల్లి మహేష్, అనిల్ , అశోక్, భారత్ , వినయ్,సురేష్, ఆనంద్, నరేష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
కరీంనగర్, భారత శక్తి
బిజెపి రాష్ట్ర కార్యాలయం పై కాంగ్రెస్ శ్రేణులు దాడి చేయడం పట్ల కరీంనగర్ జిల్లా బిజెపి శ్రేణులు భగ్గుమన్నారు. మంగళవారం నగరంలోని కోర్టు చౌరస్తాలో నిరసనగా రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బిజెపి కరీంనగర్ పార్లమెంటు కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావ్ మాట్లాడుతూ బిజెపి రాష్ట్ర కార్యాలయం పై దాడి చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నమని, దాడిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రౌడీయిజాన్ని, దౌర్జన్యాలను వారే పెంచి పోషిస్తున్నట్లేనన్నారు. దాడుల సంస్కృతి సమంజసం కాదని, చట్ట వ్యతిరేక పనులను కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించడం మూర్ఖత్వం చర్య అన్నారు.ఎవరైనా తప్పుడు వ్యాఖ్యలు చేసినట్లయితే ప్రజాస్వామ్య బద్దంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉందని , అవసరమైతే చట్టపరంగా కూడా శిక్షించవచ్చన్నారు. రాష్ట్రంలో అధికారం చేతిలో ఉందని చట్టాన్ని చేతిలోకితీసుకొని భయభ్రాంతులకు గురి చేస్తూ, కార్యాలయాల పైన దాడులకు తెగబడడాన్ని దుర్మార్గమైన చర్యగా భావిస్తున్నామని తెలిపారు.
గురుకుల విద్యార్థులను పరామర్శించిన బిజెపి శ్రేణులుకరీంనగర్ పట్టణం శర్మానగర్లోని మహాత్మా జ్యోతిబాఫూలే గురుకుల పాఠశాలలోని 23 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని మంగళవారం బిజెపి పార్టీ నాయకులు ఆసుపత్రికి తరలి వెళ్లారు. ఈ సందర్భంగా విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని, ఫుడ్ పాయిజన్ గల కారణాలను వైద్యులనుఅడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్యాలతో జీవితాలతోచెలగాటమాడుతుందని అనునిత్యం రాష్ట్రంలోని ఎక్కడో ఒకచోట ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వం తగిన నివారణ చర్యలు చేపట్టడం లేదని బిజెపి నాయకులు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు వంగల పవన్, కొలగని శ్రీనివాస్, కటకం లోకేష్, నాగసముద్రం ప్రవీణ్, శివారెడ్డి, పాదం శివరాజు, కరండ్ల రతన్ , సంతోష్, ఓదెలు, నాంపల్లి శ్రీనివాస్, చడా ఆనంద్, మాసం గణేష్, పొన్నం మొండన్న , బండారు గాయత్రి, సత్యనారాయణ, కేంచ శేఖర్, ఉప్పరపెల్లి శ్రీనివాస్, శ్రీరాముల శ్రీకాంత్, ఈస్సాపెల్లి మహేష్, అనిల్ , అశోక్, భారత్ , వినయ్,సురేష్, ఆనంద్, నరేష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
