రథసప్తమిని పురస్కరించుకుని ఏర్పట్లపై సమావేశం నిర్వహించిన టీటీడీ పాలకమండలి

తిరుపతి జిల్లా ప్రతినిధి, ఫిబ్రవరి 01, భారత శక్తి : ఫిబ్రవరి 4 వ తేది జరగనున్న రథసప్తమి ఏర్పాట్లపై పాలకమండలి సమావేశం నిర్వహించారు. సప్త వాహనాలపై శ్రీవారూ తిరుమాడ వీధుల్లో ఊరేగి దర్శన భాగ్యం ఇస్తారని,రథసప్తమి నాడు 6.44 కు సూర్యోదయ గడియలు ఈ గడియల్లో స్వామి వారిని సూర్య కిరణాలు తాకుతాయని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. 2 లక్షల మంది వస్తారని అంచనా వేసామని, రథసప్తమి నాడు ఆర్జిత సేవలు, ప్రివిలేజ్ దర్శనాలు రద్దు చేశామని తెలిపారు. టైం స్లాట్ టికెట్స్ 3-5 వరకు రద్దు చేశామని, ప్రత్యేక ప్రవేశ దర్శనం కలిగిన భక్తులకు నిర్ణీత సమయంలో దర్శన భాగ్యం కల్పిస్తామని అయన అన్నారు.1250 మంది పోలీసులు, 1000 మంది విజిలెన్స్ సిబ్బందితో కట్టుదిట్టమైన ఏర్పాట్లు,పార్కింగ్, అగ్నిప్రమాదాలు, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. గ్యాలరీలలో ప్రత్యేక ఏర్పాట్లు ,చక్రస్నాన సమయంలో పుష్కరిణిలో గజ ఈతగాళ్లను నియమించామని,గ్యాలరీలలో వేచి ఉన్న భక్తులకు నిరంతరాయంగా అన్నపానీయాలు వితరణ చేస్తామన్నారు.ఆలయ మాడ విధుల్లో చలవపందిళ్లు ఏర్పాట్లు,8 లక్షల లడ్డూలు భక్తుల సౌకర్యార్థం అందుబాటులో పెడుతున్నట్లు,తిరుమలను విద్యుత్, పుష్పాలంకరణతో అత్యంత సుందరంగా తీర్చి దిద్దుతామని వెల్లడించారు.తప్పిపోయిన ఉద్యోగి కోసం టీటీడీ విజిలెన్స్, యూపీ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టామని,సీసీకెమెరాల ఆధారంగా విచారణ సాగుతోందని తొక్కిసలాట పై జ్యూడీషియల్ ఎంక్వయిరీ జరుగుతున్న సమయంలో మరో ఎంక్వయిరీ చేయకూడదని టీటీడీ పాలకమండలి చైర్మన్ బి ఆర్ నాయుడు తెలిపారు.

రథసప్తమిని పురస్కరించుకుని ఏర్పట్లపై సమావేశం నిర్వహించిన టీటీడీ పాలకమండలి

తిరుపతి జిల్లా ప్రతినిధి, ఫిబ్రవరి 01, భారత శక్తి : ఫిబ్రవరి 4 వ తేది జరగనున్న రథసప్తమి ఏర్పాట్లపై పాలకమండలి సమావేశం నిర్వహించారు.
సప్త వాహనాలపై శ్రీవారూ తిరుమాడ వీధుల్లో ఊరేగి దర్శన భాగ్యం ఇస్తారని,రథసప్తమి నాడు 6.44 కు సూర్యోదయ గడియలు ఈ గడియల్లో స్వామి వారిని సూర్య కిరణాలు తాకుతాయని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు.
2 లక్షల మంది వస్తారని అంచనా వేసామని,
రథసప్తమి నాడు ఆర్జిత సేవలు, ప్రివిలేజ్ దర్శనాలు రద్దు చేశామని తెలిపారు. టైం స్లాట్ టికెట్స్ 3-5 వరకు రద్దు చేశామని, ప్రత్యేక ప్రవేశ దర్శనం కలిగిన భక్తులకు నిర్ణీత సమయంలో దర్శన భాగ్యం కల్పిస్తామని అయన అన్నారు.1250 మంది పోలీసులు, 1000 మంది విజిలెన్స్ సిబ్బందితో కట్టుదిట్టమైన ఏర్పాట్లు,పార్కింగ్, అగ్నిప్రమాదాలు, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
గ్యాలరీలలో ప్రత్యేక ఏర్పాట్లు ,చక్రస్నాన సమయంలో పుష్కరిణిలో గజ ఈతగాళ్లను నియమించామని,గ్యాలరీలలో వేచి ఉన్న భక్తులకు నిరంతరాయంగా అన్నపానీయాలు వితరణ చేస్తామన్నారు.ఆలయ మాడ విధుల్లో చలవపందిళ్లు ఏర్పాట్లు,8 లక్షల లడ్డూలు భక్తుల సౌకర్యార్థం అందుబాటులో పెడుతున్నట్లు,తిరుమలను విద్యుత్, పుష్పాలంకరణతో అత్యంత సుందరంగా తీర్చి దిద్దుతామని వెల్లడించారు.తప్పిపోయిన ఉద్యోగి కోసం టీటీడీ విజిలెన్స్, యూపీ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టామని,సీసీకెమెరాల ఆధారంగా విచారణ సాగుతోందని తొక్కిసలాట పై జ్యూడీషియల్ ఎంక్వయిరీ జరుగుతున్న సమయంలో మరో ఎంక్వయిరీ చేయకూడదని టీటీడీ పాలకమండలి చైర్మన్ బి ఆర్ నాయుడు తెలిపారు.

About The Author

Related Posts