నేటి భారతం

ప్రకృతిని కాపాడటం అంటే మన భవిష్యత్తును కాపాడుకోవడం..
భూమి అనేది మన పితృసంపద కాదు, భవిష్యత్ తరాలకు ఆస్థి..
ప్రకృతిని ధ్వంసం చేస్తే మన జీవనాధారాన్ని కోల్పోతాం...
ఒక చెట్టు నాటితే, వందల ప్రాణాలకు ఊపిరి పోసినవాళ్ళం అవుతాం..
నీటిని ఆదా చేయడం అంటే ఎన్నో జీవాలను రక్షించడం..
ప్రకృతి లేకపోతే మనిషి ఉండడు..
మనిషి లేకపోయినా ప్రకృతి ఉంటుంది...
ప్రకృతి మనకు కావలసినన్ని ఇస్తుంది,
కానీ మన దురాశను మాత్రం ఎప్పటికీ తీర్చలేదు..
అలాగే జంతువులను కాపాడటం అంటే
పర్యావరణాన్ని సమతుల్యం చేయడం.
పచ్చదనం పెరిగితే జీవనోత్సాహం పెరుగుతుంది...
ప్రకృతిని కాపాడితే, ప్రకృతి మనల్ని కాపాడుతుంది...
ఇవి కేవలం అక్షరాలతో కూడిన పదాలు మాత్రమే కాదు..
ఇవి జీవిత సత్యాలు.. ఆచరణీయమైన వాస్తవాలు..
About The Author
08 Nov 2025
