నేటి భారతం :

మనిషి ఏ పని చేసినా..
అవసరానికి సరిపడా డబ్బు కోసమే కదా..
కీర్తి ప్రతిష్టలు కావాలనుకుంటే మీకున్న దాంట్లో ఎదుటివారికి సహాయం చేయవచ్చు...
అది శారీరకంగా నైనా మానసికంగా నైనా లేదా ఇంకే రూపాన అయినా సరే..
కానీ ఈ లోకంలో చాలామంది అవసరానికి మించి సంపాదిస్తున్నారు..
సరే అది వారి ఇష్టం వారి కష్టం అనుకుందాం..
ఎదుటివారికి సహాయం చేయడం చేయకపోవడం అన్నది వారి విజ్ఞతకు వదిలేద్దాం..
కానీ ఇక్కడ సమస్య ఏమిటంటే..
ఆ సంపాదన అవినీతి సంపాదన కావడం దురదృష్టకరం..
ఎదుటివారికి సహాయం చేయకపోయినా పర్వాలేదు..
కానీ ఎదుటివారిని పీడించి సంపాదించడం ఎంతవరకు సమంజసం..?
అసలు ఏమి చేసుకుంటారు ఈ సంపాదనను..
మీరు పోయినప్పుడు తీసుకుని పోలేరు..
ఏదైనా అనారోగ్యం పాలైతే కనీసం తినడానికి కూడా మీకు వీలుపడదు..
ఇవన్నీ తెలుసు కదా మరెందుకు ఇంత నీచంగా ప్రవర్తిస్తూ ఉంటారు...
దేవుడిచ్చిన దాంట్లో పదిమందికి సహాయం చేయండి..
మీరు చనిపోయిన తర్వాత కూడా వారి హృదయాల్లో బ్రతకండి..
* బోయినపల్లి రమణారావు, సీనియర్ జర్నలిస్ట్..
