2024 సినిమాల సంవత్సరం

హైదరాబాద్‌, నవంబర్‌ 8 పండుగల సమయంలో భారీ బడ్జెట్‌ సినిమాలు విడుదలవుతుంటాయి. పండగ సెలవల్లో పదుల సంఖ్యలో సినిమాలు థియేటర్స్‌ లో రిలీజ్‌ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా సంక్రాంతి సందర్బంగా టాలీవుడ్‌ బాక్సాఫీస్‌ వద్ద భారీ ఫైట్‌ ఉంటుంది. 2024 సంక్రాంతికి భారీ పోటీ ఉండే అవకాశం కనిపిస్తుంది. ఈ సందర్భంగా ఆరు భారీ సినిమాలు విడుదలవుతున్నాయి. దీంతో ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పెద్ద పండుగ. ఈ సెలవులను సినీ నిర్మాతలు బాగా క్యాష్‌ చేసుకుంటుంటారు. వచ్చే ఏడాది జనవరిలో ‘గుంటూరు కారం’, ‘ఈగల్‌’ సహా ఆరు భారీ సినిమాలు విడుదల కానున్నాయి.సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు నటించిన ‘గుంటూరు కారం’ సినిమా విడుదల తేదీ ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు ఫైనల్‌ గా ఈ చిత్రాన్ని జనవరి 12న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. మహేష్‌ బాబు సరసన శ్రీలీల హీరోయిన్‌ గా నటిస్తుంది. ఈ చిత్రానికి త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. దీంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయిపౌరాణిక కథల ఆధారంగా చాలా సినిమాలు వచ్చాయి. ‘హనుమాన్‌’ సినిమా కూడా అలాంటి తరహా చిత్రమే. హనుమాన్‌ స్ఫూర్తితో ఈ సినిమా తెరకెక్కినట్లు తెలుస్తోంది. తేజ సజ్జ హీరోగా నటిస్తున్న ఈ సినిమా కూడా సంక్రాంతి పండుగ తేదీని ఫిక్స్‌ చేసుకున్నారు. ఈ సినిమా టీజర్‌ అందరినీ ఆకట్టుకుంది.విజయ్‌ దేవరకొండ రీసెంట్‌ గా ‘ఖుషి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా మిక్స్డ్‌ టాక్‌ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు ‘ఫ్యామిలీ స్టార్‌’ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. జనవరి 13న సినిమా విడుదల కానుంది ఈ సినిమా. ఈ సినిమా కోసం విజయ్‌ దేవరకొండ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అలాగే దగ్గుబాటి వెంకటేష్‌, ఆర్య, రుహాని శర్మ నటించిన ‘సైంధవ’ కూడా సంక్రాంతికే ఫిక్స్‌ అయ్యింది. అలాగే రవితేజ ‘ఈగల్‌ ‘ కూడా సంక్రాంతికే విడుదల కానుంది. అక్కినేని నాగార్జున నటించిన ‘నా సామి రంగ’ టీమ్‌ కూడా సంక్రాంతికి రానుంది.సంక్రాంతికి మొత్తంగా ఆరు సినిమాలు విడుదల కానున్నాయి.

2024  సినిమాల సంవత్సరం

హైదరాబాద్‌, నవంబర్‌ 8
పండుగల సమయంలో భారీ బడ్జెట్‌ సినిమాలు విడుదలవుతుంటాయి. పండగ సెలవల్లో పదుల సంఖ్యలో సినిమాలు థియేటర్స్‌ లో రిలీజ్‌ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా సంక్రాంతి సందర్బంగా టాలీవుడ్‌ బాక్సాఫీస్‌ వద్ద భారీ ఫైట్‌ ఉంటుంది. 2024 సంక్రాంతికి భారీ పోటీ ఉండే అవకాశం కనిపిస్తుంది. ఈ సందర్భంగా ఆరు భారీ సినిమాలు విడుదలవుతున్నాయి. దీంతో ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పెద్ద పండుగ. ఈ సెలవులను సినీ నిర్మాతలు బాగా క్యాష్‌ చేసుకుంటుంటారు. వచ్చే ఏడాది జనవరిలో ‘గుంటూరు కారం’, ‘ఈగల్‌’ సహా ఆరు భారీ సినిమాలు విడుదల కానున్నాయి.సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు నటించిన ‘గుంటూరు కారం’ సినిమా విడుదల తేదీ ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు ఫైనల్‌ గా ఈ చిత్రాన్ని జనవరి 12న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. మహేష్‌ బాబు సరసన శ్రీలీల హీరోయిన్‌ గా నటిస్తుంది. ఈ చిత్రానికి త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. దీంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయిపౌరాణిక కథల ఆధారంగా చాలా సినిమాలు వచ్చాయి. ‘హనుమాన్‌’ సినిమా కూడా అలాంటి తరహా చిత్రమే. హనుమాన్‌ స్ఫూర్తితో ఈ సినిమా తెరకెక్కినట్లు తెలుస్తోంది. తేజ సజ్జ హీరోగా నటిస్తున్న ఈ సినిమా కూడా సంక్రాంతి పండుగ తేదీని ఫిక్స్‌ చేసుకున్నారు. ఈ సినిమా టీజర్‌ అందరినీ ఆకట్టుకుంది.విజయ్‌ దేవరకొండ రీసెంట్‌ గా ‘ఖుషి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా మిక్స్డ్‌ టాక్‌ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు ‘ఫ్యామిలీ స్టార్‌’ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. జనవరి 13న సినిమా విడుదల కానుంది ఈ సినిమా. ఈ సినిమా కోసం విజయ్‌ దేవరకొండ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అలాగే దగ్గుబాటి వెంకటేష్‌, ఆర్య, రుహాని శర్మ నటించిన ‘సైంధవ’ కూడా సంక్రాంతికే ఫిక్స్‌ అయ్యింది. అలాగే రవితేజ ‘ఈగల్‌ ‘ కూడా సంక్రాంతికే విడుదల కానుంది. అక్కినేని నాగార్జున నటించిన ‘నా సామి రంగ’ టీమ్‌ కూడా సంక్రాంతికి రానుంది.సంక్రాంతికి మొత్తంగా ఆరు సినిమాలు విడుదల కానున్నాయి.

About The Author

Related Posts