బఫూన్స్‌ అనడం… నమ్మించి మోసం చేయడమే కారణమా?

బిగ్‌ బాస్‌-7(Biggboss7) నాలుగోవారం ఎలిమినేషన ఆదివారం పూర్తయింది. గ్లామర్‌ డాల్‌ రతిక రోజ్‌ (Rathika rose) ఎలిమినేట్‌ అయి బయటకు వెళ్లిపోయింది. అయితే ఆమె ఎలిమినేషన పెద్ద షాక్‌గా ఫీలవుతున్నారు వీక్షకులు. ఈ సారి టైటిల్‌ తానే కొట్టాలనే బలమైన నిర్ణయంతో హౌస్‌లో అడుగుపెట్టింది రతిక. తొలివారం అందరూ తన గురించి మాట్లాడుకునేలా చేసింది. కెమెరాలు అన్నీ తనపై ఫోకస్‌ అయ్యేలా చేసుకుంది. అక్కడి వరకూ బాగానే సక్సెస్‌ అయింది. కానీ గేమ్స్‌, టాస్కుల విషయానికి వచ్చేసరికి చతికిలపడిపోయింది. ఏ ఆట సరిగ్గా ఆడలేకపోయింది. ఇక రెండోవారంలో సొంత టీమ్‌ సభ్యులనే బఫూన్స్‌ అనడం చర్చనీయాంశంగా మారిపోయింది. మొదట పల్లవి ప్రశాంతను ట్రాప్‌లో దించినట్లు బీహేవ్‌ చేసింది. తర్వాత యావర్‌తో ప్రేమగా ఉన్నట్లు నటిస్తూనే వెనక నుంచి దెబ్బ తీసింది. దాంతో మొదటివారం సంపాదించిన పాజిటివిటీ మొత్తాన్ని కోల్పోయింది. దానికి రిజల్ట్‌ ఓటింగ్‌ తగ్గిపోయింది. అందుకే ఆమె ఎలిమినేట్‌ అయినట్లు భావిస్తున్నారు. గ్లామర్‌ పోయింది… అయితే బిగ్‌బాస్‌ షో అబ్బాయిలు, అమ్మాయిలు ఈక్వల్‌గా ఉండేలా చూస్తుంటారు నిర్వాహకులు. ఎలిమినేషన్‌ కూడా అందుకు తగ్గట్లే చేస్తుంటారు. కానీ ఈ సారి అలా లేదు. ఉల్టా -పుల్టాగా సాగుతోంది. వరుసగా మూడు వారాలు మహిళలే ఎలిమినేట్‌ అయ్యారు. ఇప్పుడు నాలుగో వారం ఇప్పుడు రతిక హౌస్‌ నుంచి వెళ్లిపోయింది. ఇంతకుముందు ఎప్పుడు వరుసలగా మహిళలే ఎలిమినేట్‌ అయిన సందర్భాలు లేవు. ఇదే మొదటిసారిగా చెబుతున్నారు. అయితే ఇంట్లో గ్లామర్‌ మాత్రం తగ్గిందని చెప్పొచ్చు. ఇప్పటికే దామిని వెళ్లిపోయింది. రతిక కూడా అవుట్‌. దీంతో ఇంట్లో కలరింగ్‌ కూడా తగ్గినట్లే. ప్రస్తుతం శుభశ్రీ, శోభాశెట్టిలు ఇంటిలో కాస్త గ్లామర్‌ని పంచుతున్నారు. అయితే వచ్చేవారం నయని పావని, అంజలి పవన్‌ లాంటి బ్యూటీస్‌ రాబోతున్నారట. పారితోషికం ఎక్కువే… బిగ్‌బాస్‌ హౌస్‌లో గ్లామర్‌ డాల్‌గా తనదైన స్లాంగ్‌తో అలరిస్తూ అడుగుపెట్టిన రతిక పారితోషికం కూడా బాగానే తీసుకుందట. ప్రతివారం రూ.2 లక్షల చొప్పున నాలుగు వారాలకు రూ.8 లక్షలు సొంతం చేసుకుందని సమాచారం

బఫూన్స్‌ అనడం… నమ్మించి మోసం చేయడమే కారణమా?

బిగ్‌ బాస్‌-7(Biggboss7) నాలుగోవారం ఎలిమినేషన ఆదివారం పూర్తయింది. గ్లామర్‌ డాల్‌ రతిక రోజ్‌ (Rathika rose) ఎలిమినేట్‌ అయి బయటకు వెళ్లిపోయింది. అయితే ఆమె ఎలిమినేషన పెద్ద షాక్‌గా ఫీలవుతున్నారు వీక్షకులు. ఈ సారి టైటిల్‌ తానే కొట్టాలనే బలమైన నిర్ణయంతో హౌస్‌లో అడుగుపెట్టింది రతిక. తొలివారం అందరూ తన గురించి మాట్లాడుకునేలా చేసింది. కెమెరాలు అన్నీ తనపై ఫోకస్‌ అయ్యేలా చేసుకుంది. అక్కడి వరకూ బాగానే సక్సెస్‌ అయింది. కానీ గేమ్స్‌, టాస్కుల విషయానికి వచ్చేసరికి చతికిలపడిపోయింది. ఏ ఆట సరిగ్గా ఆడలేకపోయింది. ఇక రెండోవారంలో సొంత టీమ్‌ సభ్యులనే బఫూన్స్‌ అనడం చర్చనీయాంశంగా మారిపోయింది. మొదట పల్లవి ప్రశాంతను ట్రాప్‌లో దించినట్లు బీహేవ్‌ చేసింది. తర్వాత యావర్‌తో ప్రేమగా ఉన్నట్లు నటిస్తూనే వెనక నుంచి దెబ్బ తీసింది. దాంతో మొదటివారం సంపాదించిన పాజిటివిటీ మొత్తాన్ని కోల్పోయింది. దానికి రిజల్ట్‌ ఓటింగ్‌ తగ్గిపోయింది. అందుకే ఆమె ఎలిమినేట్‌ అయినట్లు భావిస్తున్నారు.

గ్లామర్‌ పోయింది…

అయితే బిగ్‌బాస్‌ షో అబ్బాయిలు, అమ్మాయిలు ఈక్వల్‌గా ఉండేలా చూస్తుంటారు నిర్వాహకులు. ఎలిమినేషన్‌ కూడా అందుకు తగ్గట్లే చేస్తుంటారు. కానీ ఈ సారి అలా లేదు. ఉల్టా -పుల్టాగా సాగుతోంది. వరుసగా మూడు వారాలు మహిళలే ఎలిమినేట్‌ అయ్యారు. ఇప్పుడు నాలుగో వారం ఇప్పుడు రతిక హౌస్‌ నుంచి వెళ్లిపోయింది. ఇంతకుముందు ఎప్పుడు వరుసలగా మహిళలే ఎలిమినేట్‌ అయిన సందర్భాలు లేవు. ఇదే మొదటిసారిగా చెబుతున్నారు. అయితే ఇంట్లో గ్లామర్‌ మాత్రం తగ్గిందని చెప్పొచ్చు. ఇప్పటికే దామిని వెళ్లిపోయింది. రతిక కూడా అవుట్‌. దీంతో ఇంట్లో కలరింగ్‌ కూడా తగ్గినట్లే. ప్రస్తుతం శుభశ్రీ, శోభాశెట్టిలు ఇంటిలో కాస్త గ్లామర్‌ని పంచుతున్నారు. అయితే వచ్చేవారం నయని పావని, అంజలి పవన్‌ లాంటి బ్యూటీస్‌ రాబోతున్నారట.

పారితోషికం ఎక్కువే…

బిగ్‌బాస్‌ హౌస్‌లో గ్లామర్‌ డాల్‌గా తనదైన స్లాంగ్‌తో అలరిస్తూ అడుగుపెట్టిన రతిక పారితోషికం కూడా బాగానే తీసుకుందట. ప్రతివారం రూ.2 లక్షల చొప్పున నాలుగు వారాలకు రూ.8 లక్షలు సొంతం చేసుకుందని సమాచారం

About The Author

Related Posts