నాన్నతో ప్రేమలో పడిపోతారు

నాని కథానాయకుడిగా శౌర్యవ్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘హాయ్‌ నాన్న’. మృణాల్‌ ఠాకూర్‌ కథానాయిక. మోహన్‌ చెరుకూరి, డాక్టర్‌ విజయేందర్‌ రెడ్డి నిర్మాతలు. డిసెంబరు 7న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. శుక్రవారం హైదరాబాద్‌లో ట్రైలర్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ ‘‘ఈ సినిమాలో నాకు నేను అందంగా కనిపించాను. సాన్‌ జాన్‌ విజువల్స్‌ అంత బాగున్నాయి. ఇప్పటి వరకూ ట్రైలర్‌, పాటలే చూశారు. మీరు చూడని విశేషాలు సినిమాలో చాలా ఉన్నాయి. సినిమా నా ఊపిరి. నా ఆక్సిజన్‌. ఆ ఊపిరి మీద ఒట్టేసి చెబుతున్నా.. డిసెంబరు 7న ప్రేక్షకులంతా నాన్న ప్రేమలో పడిపోవడం ఖాయం’’ అన్నారు. రచయిత కాశి మాట్లాడుతూ ‘‘శౌర్యవ్‌ అద్భుతమైన కథ రాశారు. ఆయన ప్రతిభ సినిమా విడుదలైన తరవాతే తెలుస్తుంది. కథ నచ్చితే అన్ని రకాలుగా ప్రోత్సహించే హీరో నాని. మా అందరికీ ‘హాయ్‌ నాన్న’ మంచి పేరు తీసుకొస్తుందన్న నమ్మకం ఉంద’’న్నారు.

About The Author

Related Posts