మెగా 154 కోసం భారీ సెట్‌.. మలేషియా వెళుతున్న చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), డైరెక్ట‌ర్ బాబీ (Director Bobby) కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. సినిమా టైటిల్‌ను అధికారికంగా ప్ర‌క‌టించ‌లేదు కానీ.. అంద‌రూ ‘వాల్తేరు వీరయ్య’ అని ఫిక్స్ అయిపోయారు. ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. చాన్నాళ్ల త‌ర్వాత మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ప‌క్కా మాస్ లుక్‌లో చేస్తోన్న సినిమా అది. లుక్‌ను కూడా చిత్ర యూనిట్ రివీల్ చ‌సేసిన సంగతి తెలిసిందే. తాజాగా సినీ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోన్న స‌మాచారం మేర‌కు మెగా 154 కోసం చెన్నైలో మేక‌ర్స్ భారీ ప‌డ‌వ సెట్‌ను సిద్ధం చేస్తున్నార‌ట‌. ఈ సెట్ వేయ‌డానికి కూడా మేజ‌ర్ టెక్నీషియ‌న్స్‌ను కూడా మ‌న టాలీవుడ్ నుంచే తీసుకెళ్లారు. మ‌రో వైపు ఇదే సినిమా కొత్త షెడ్యూల్ కోసం చిరంజీవి మ‌లేషియా (Malaysia) వెళుతున్నారు. కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించేలా ప్లాన్ చేసుకున్నారు. శ్రుతీ హాస‌న్ (Shruti Haasan) ఇందులో హీరోయిన్‌గా న‌టిస్తోంది. మెగా హీరోల్లో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రామ్ చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్‌ల‌తో నటించిన శ్రుతీ హాస‌న్ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో సైతం జోడీ క‌డుతోంది. ఇందులో మాస్ మ‌హారాజా ర‌వితేజ (Ravi Teja) చిరంజీవి త‌మ్ముడి పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నార‌ని కూడా వార్త‌లు వినిపిస్తున్నాయి. త్వ‌ర‌లోనే ఆయ‌న కూడా ఈ సినిమా సెట్స్‌లో జాయిన్ కాబోతున్నారు. కుర్ర హీరోలు కూడా ఆలోచిస్తుంటే.. వారికి భిన్నంగా స్పీడుమీదున్నారు. వ‌రుస‌గా సినిమాలు చేసుకుంటూ వ‌స్తున్నారు. ఈ ఏడాది ఆయ‌న హీరోగా న‌టించిన ఆచార్య (Acharya) సినిమా విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. కాగా.. ఇప్పుడు మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న లూసిఫ‌ర్ రీమేక్‌ గాడ్‌ఫాద‌ర్ (God Father) సినిమా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. అలాగే మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న భోళా శంక‌ర్ (Bhola Shankar)కూడా సెట్స్‌పై ఉంది. బాబీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న వాల్తేరు వీర‌య్య కూడా షూటింగ్ పూర్తి చేసుకుంటోంది. మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

మెగా 154 కోసం భారీ సెట్‌.. మలేషియా వెళుతున్న చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), డైరెక్ట‌ర్ బాబీ (Director Bobby) కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. సినిమా టైటిల్‌ను అధికారికంగా ప్ర‌క‌టించ‌లేదు కానీ.. అంద‌రూ ‘వాల్తేరు వీరయ్య’ అని ఫిక్స్ అయిపోయారు. ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. చాన్నాళ్ల త‌ర్వాత మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ప‌క్కా మాస్ లుక్‌లో చేస్తోన్న సినిమా అది. లుక్‌ను కూడా చిత్ర యూనిట్ రివీల్ చ‌సేసిన సంగతి తెలిసిందే. తాజాగా సినీ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోన్న స‌మాచారం మేర‌కు మెగా 154 కోసం చెన్నైలో మేక‌ర్స్ భారీ ప‌డ‌వ సెట్‌ను సిద్ధం చేస్తున్నార‌ట‌. ఈ సెట్ వేయ‌డానికి కూడా మేజ‌ర్ టెక్నీషియ‌న్స్‌ను కూడా మ‌న టాలీవుడ్ నుంచే తీసుకెళ్లారు.

మ‌రో వైపు ఇదే సినిమా కొత్త షెడ్యూల్ కోసం చిరంజీవి మ‌లేషియా (Malaysia) వెళుతున్నారు. కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించేలా ప్లాన్ చేసుకున్నారు. శ్రుతీ హాస‌న్ (Shruti Haasan) ఇందులో హీరోయిన్‌గా న‌టిస్తోంది. మెగా హీరోల్లో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రామ్ చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్‌ల‌తో నటించిన శ్రుతీ హాస‌న్ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో సైతం జోడీ క‌డుతోంది. ఇందులో మాస్ మ‌హారాజా ర‌వితేజ (Ravi Teja) చిరంజీవి త‌మ్ముడి పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నార‌ని కూడా వార్త‌లు వినిపిస్తున్నాయి. త్వ‌ర‌లోనే ఆయ‌న కూడా ఈ సినిమా సెట్స్‌లో జాయిన్ కాబోతున్నారు.

కుర్ర హీరోలు కూడా ఆలోచిస్తుంటే.. వారికి భిన్నంగా స్పీడుమీదున్నారు. వ‌రుస‌గా సినిమాలు చేసుకుంటూ వ‌స్తున్నారు. ఈ ఏడాది ఆయ‌న హీరోగా న‌టించిన ఆచార్య (Acharya) సినిమా విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. కాగా.. ఇప్పుడు మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న లూసిఫ‌ర్ రీమేక్‌ గాడ్‌ఫాద‌ర్ (God Father) సినిమా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. అలాగే మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న భోళా శంక‌ర్ (Bhola Shankar)కూడా సెట్స్‌పై ఉంది. బాబీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న వాల్తేరు వీర‌య్య కూడా షూటింగ్ పూర్తి చేసుకుంటోంది. మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

About The Author

Related Posts