థియేటర్స్‌లో సక్సెస్‌.. ఇప్పుడు ఓటీటీ కోసం…

థియేటర్స్‌లో విడుదలై సంచలన విజయం సాధించిన పలు చిత్రాలు ఇప్పుడు ఓటీటీలో సందడి చేయడానికి సిద్ధమయ్యాయి. ఈ వారం పలు ఓటీటీల్లో స్ట్రీమింగ్‌ (OTT movies) కానున్న సినిమాలేంటో చూద్దాం. పవన్‌కల్యాణ్‌(Pawan kalyan) సాయిధరమ్‌ (Sai dharam tej) తేజ్‌ హీరోలుగా నటించిన . బ్రో’ (Bro) చిత్రం ఈ శుక్రవారం నెట్‌ఫ్లిక్స్‌లో స్ర్టీమింగ్‌ కానుంది. ‘వినోదాయసిత్తం’కు రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకుల్ని అలరించడానికి సిద్ధమైందిజ సముద్రఖని దర్శకత్వంలో జీస్టూడియోస్‌, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్‌ నిర్మించిన ఈ చిత్రం గత నెలలో ప్రేక్షకుల ముందుకొచ్చి అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించింది. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఆగస్టు 25న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నుంచి స్ర్టీమింగ్‌కానుంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై భారీ విజయం సాధించిన ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీ ‘బేబీ’. (Baby) ఆనంద్‌ దేవరకొండ, విరాజ్‌ అశ్విన్‌, వైష్ణవి చైతన్య నటించారు. సాయి రాజేశ్‌ దర్శకత్వంలో ఎస్‌కెఎన్‌ నిర్మించారు. థియేటర్‌లో సంచలనం సృష్టించిన ఈ చిత్రం ఈనెల 25న తెలుగు ఓటీటీ ‘ఆహా’లో స్ర్టీమింగ్‌ కానుంది. ‘ఆహా గోల్డ్‌’ మెంబర్‌షిప్‌ ఉన్నవాళ్లు 12 గంటల ముందే చూడొచ్చు. సంజయ్‌ రావు, ప్రణవి మానుకొండ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘స్లమ్‌డాగ్‌ హస్బెండ్‌’. సునీల్‌, ఆలీ, బ్రహ్మాజీ, సప్తగిరి, చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషించారు. బ్రహ్మాజీ వినూత్నరీతిలో ప్రమోషన్‌ చేసిన ఈ చిత్రం అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలకానుంది.. ఏ.ఆర్‌.శ్రీధర్‌ దర్శకత్వం వహించిన ఫ్యామిలీ కామెడీ ఎంటర్‌టైనర్‌ ఇది. జులై నెలలో థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందన సొంతం చేసుకున్న ఈ చిత్రం ఓటీటీలో దర్శనమివ్వనుంది. వీటిలోపాటు వివిధ భాషాలో ఈ వారం ఓటీటీలో సందడి చేయబోతున్న చిత్రాలివే.. నెట్‌ఫ్లిక్స్‌ ఆగస్టు 24 -రాగ్నరోక్‌ (వెబ్‌సిరీస్‌) ఆగస్టు 25 – కిల్లర్‌ బుక్‌ క్లబ్‌ (స్పానిష్‌) ఆగస్టు 25 – లిఫ్ట్‌ (హాలీవుడ్‌) డిస్నీ+హాట్‌స్టార్‌ ఆగస్టు 25 – ఆఖ్రి సచ్ (హిందీ సిరీస్‌) బుక్‌ మై షో ఆగస్టు 21 – సమ్‌వేర్‌ ఇన్‌ క్వీన్స్‌ (హాలీవుడ్‌) లయన్స్‌ గేట్‌ప్లే ఆగస్టు 25 – ఎబౌట్‌ మై ఫాదర్‌ (హాలీవుడ్‌) యాపిల్‌ టీవీ ప్లస్‌ ఆగస్టు 23 – ఇన్వాజిన్‌2 (వెబ్‌సిరీస్‌) ఆగస్టు 25 – వాంటెడ్‌: ది ఎస్కేప్‌ ఆఫ్‌ కార్లోస్‌ గోసన్‌ (ఇంగ్లీష్‌) జియో సినిమా బజావ్‌ – ఆగస్టు 25

థియేటర్స్‌లో విడుదలై సంచలన విజయం సాధించిన పలు చిత్రాలు ఇప్పుడు ఓటీటీలో సందడి చేయడానికి సిద్ధమయ్యాయి. ఈ వారం పలు ఓటీటీల్లో స్ట్రీమింగ్‌ (OTT movies) కానున్న సినిమాలేంటో చూద్దాం.

పవన్‌కల్యాణ్‌(Pawan kalyan) సాయిధరమ్‌ (Sai dharam tej) తేజ్‌ హీరోలుగా నటించిన . బ్రో’ (Bro) చిత్రం ఈ శుక్రవారం నెట్‌ఫ్లిక్స్‌లో స్ర్టీమింగ్‌ కానుంది. ‘వినోదాయసిత్తం’కు రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకుల్ని అలరించడానికి సిద్ధమైందిజ సముద్రఖని దర్శకత్వంలో జీస్టూడియోస్‌, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్‌ నిర్మించిన ఈ చిత్రం గత నెలలో ప్రేక్షకుల ముందుకొచ్చి అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించింది. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఆగస్టు 25న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నుంచి స్ర్టీమింగ్‌కానుంది.

ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై భారీ విజయం సాధించిన ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీ ‘బేబీ’. (Baby) ఆనంద్‌ దేవరకొండ, విరాజ్‌ అశ్విన్‌, వైష్ణవి చైతన్య నటించారు. సాయి రాజేశ్‌ దర్శకత్వంలో ఎస్‌కెఎన్‌ నిర్మించారు.

థియేటర్‌లో సంచలనం సృష్టించిన ఈ చిత్రం ఈనెల 25న తెలుగు ఓటీటీ ‘ఆహా’లో స్ర్టీమింగ్‌ కానుంది. ‘ఆహా గోల్డ్‌’ మెంబర్‌షిప్‌ ఉన్నవాళ్లు 12 గంటల ముందే చూడొచ్చు.

సంజయ్‌ రావు, ప్రణవి మానుకొండ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘స్లమ్‌డాగ్‌ హస్బెండ్‌’. సునీల్‌, ఆలీ, బ్రహ్మాజీ, సప్తగిరి, చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషించారు. బ్రహ్మాజీ వినూత్నరీతిలో ప్రమోషన్‌ చేసిన ఈ చిత్రం అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలకానుంది.. ఏ.ఆర్‌.శ్రీధర్‌ దర్శకత్వం వహించిన ఫ్యామిలీ కామెడీ ఎంటర్‌టైనర్‌ ఇది. జులై నెలలో థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందన సొంతం చేసుకున్న ఈ చిత్రం ఓటీటీలో దర్శనమివ్వనుంది.

వీటిలోపాటు వివిధ భాషాలో ఈ వారం ఓటీటీలో సందడి చేయబోతున్న చిత్రాలివే..

నెట్‌ఫ్లిక్స్‌

ఆగస్టు 24 -రాగ్నరోక్‌ (వెబ్‌సిరీస్‌)

ఆగస్టు 25 – కిల్లర్‌ బుక్‌ క్లబ్‌ (స్పానిష్‌)

ఆగస్టు 25 – లిఫ్ట్‌ (హాలీవుడ్‌)

డిస్నీ+హాట్‌స్టార్‌

ఆగస్టు 25 – ఆఖ్రి సచ్ (హిందీ సిరీస్‌)

బుక్‌ మై షో

ఆగస్టు 21 – సమ్‌వేర్‌ ఇన్‌ క్వీన్స్‌ (హాలీవుడ్‌)

లయన్స్‌ గేట్‌ప్లే

ఆగస్టు 25 – ఎబౌట్‌ మై ఫాదర్‌ (హాలీవుడ్‌)

యాపిల్‌ టీవీ ప్లస్‌

ఆగస్టు 23 – ఇన్వాజిన్‌2 (వెబ్‌సిరీస్‌)

ఆగస్టు 25 – వాంటెడ్‌: ది ఎస్కేప్‌ ఆఫ్‌ కార్లోస్‌ గోసన్‌ (ఇంగ్లీష్‌)

జియో సినిమా

బజావ్‌ – ఆగస్టు 25

About The Author

Related Posts