క్రీడా స్ఫూర్తితో ముగిసిన స్మార్ట్ కిడ్జ్ స్పోర్ట్స్ మీట్. స్మార్ట్ కిడ్జ్ విజేతలకు బహుమతులు అందించిన ట్రాఫిక్ ఏసిపి శ్రీనివాసులు
ఖమ్మం ప్రతినిది (భారత శక్తి ), పిబ్రవరి 08: స్మార్ట్ కిడ్జ్ పాఠశాల మైదానంలో గత రెండు రోజులుగా నిర్వహిస్తున్న స్మార్ట్ కిడ్జ్ స్పోర్ట్స్ మీట్ శనివారం సాయంత్రం తో ముగిశాయి. రెండవ రోజు విద్యార్థులకు కబడ్డీ, కోకో, హార్దిల్స్, టెన్నికాయిడ్ తదితర క్రీడాంశాలలో విద్యార్థులు పొటా పోటీగా తమ క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. పాఠశాల కరస్పాండెంట్ చింతనిప్పు కృష్ణచైతన్య పర్యవేక్షణలో జరిగిన స్పోర్ట్స్ మీట్ బహుమతి ప్రధానోత్సవ సభకు ట్రాఫిక్ ఏసిపి శ్రీనివాసులు ముఖ్యఅతిథిగా పాల్గొని విజేతలకు బహుమతి ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఏసిపి శ్రీనివాసులు మాట్లాడుతూ విద్యార్థులు గెలుపు ఓటములను క్రీడా స్ఫూర్తితో తీసుకొని భవిష్యత్తులో ఉన్నతంగా రాణించాలని కోరారు. పాఠశాల విద్యార్థులందరూ క్రీడా పోటీలలో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటి చెప్పడం అభినందనీయం అన్నారు. విద్యార్థులకు మైదానంలో క్రీడా పోటీలు నిర్వహించి ప్రోత్సహించడం పట్ల పాఠశాల యాజమాన్యాన్ని అభినందించారు. క్రీడలు మానసిక, శారీరక దృడత్వాన్ని పెంచి చదువుల్లోనూ ,ఇతర వ్యవహారాల్లోనూ చురుకుగా ఉంచేలా చైతన్యం చేస్తాయన్నారు. పాఠశాల కరస్పాండెంట్ చింతనిప్పు కృష్ణచైతన్య మాట్లాడుతూ తమ పాఠశాలలో ప్రతి విద్యార్థి క్రీడా పోటీల్లో నూ పాల్గొనేలా ప్రతి సంవత్సరం స్పోర్ట్స్ మీట్ తో ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులోనూ ప్రతి సంవత్సరం ప్రత్యేకంగా స్పోర్ట్స్ మీట్ నిర్వహిస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ చింతనిప్పు సుకన్య, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. బహుమతి ప్రధానోత్సవం అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన దేశభక్తి, జానపద, సాంప్రదాయ నృత్యాలు అందరిని ఆకట్టుకున్నాయి.
ఖమ్మం ప్రతినిది (భారత శక్తి ), పిబ్రవరి 08:
స్మార్ట్ కిడ్జ్ పాఠశాల మైదానంలో గత రెండు రోజులుగా నిర్వహిస్తున్న స్మార్ట్ కిడ్జ్ స్పోర్ట్స్ మీట్ శనివారం సాయంత్రం తో ముగిశాయి. రెండవ రోజు విద్యార్థులకు కబడ్డీ, కోకో, హార్దిల్స్, టెన్నికాయిడ్ తదితర క్రీడాంశాలలో విద్యార్థులు పొటా పోటీగా తమ క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. పాఠశాల కరస్పాండెంట్ చింతనిప్పు కృష్ణచైతన్య పర్యవేక్షణలో జరిగిన స్పోర్ట్స్ మీట్ బహుమతి ప్రధానోత్సవ సభకు ట్రాఫిక్ ఏసిపి శ్రీనివాసులు ముఖ్యఅతిథిగా పాల్గొని విజేతలకు బహుమతి ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఏసిపి శ్రీనివాసులు మాట్లాడుతూ విద్యార్థులు గెలుపు ఓటములను క్రీడా స్ఫూర్తితో తీసుకొని భవిష్యత్తులో ఉన్నతంగా రాణించాలని కోరారు. పాఠశాల విద్యార్థులందరూ క్రీడా పోటీలలో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటి చెప్పడం అభినందనీయం అన్నారు. విద్యార్థులకు మైదానంలో క్రీడా పోటీలు నిర్వహించి ప్రోత్సహించడం పట్ల పాఠశాల యాజమాన్యాన్ని అభినందించారు. క్రీడలు మానసిక, శారీరక దృడత్వాన్ని పెంచి చదువుల్లోనూ ,ఇతర వ్యవహారాల్లోనూ చురుకుగా ఉంచేలా చైతన్యం చేస్తాయన్నారు. పాఠశాల కరస్పాండెంట్ చింతనిప్పు కృష్ణచైతన్య మాట్లాడుతూ తమ పాఠశాలలో ప్రతి విద్యార్థి క్రీడా పోటీల్లో నూ పాల్గొనేలా ప్రతి సంవత్సరం స్పోర్ట్స్ మీట్ తో ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులోనూ ప్రతి సంవత్సరం ప్రత్యేకంగా స్పోర్ట్స్ మీట్ నిర్వహిస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ చింతనిప్పు సుకన్య, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. బహుమతి ప్రధానోత్సవం అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన దేశభక్తి, జానపద, సాంప్రదాయ నృత్యాలు అందరిని ఆకట్టుకున్నాయి.
