రైతులకు ఇబ్బందులు లేకుండా వరి కొనుగోలు పూర్తి చేయాలి

వికారాబాద్ జిల్లా కలెక్టర్ దిపాక్ తివారి ఆదేశం

రైతులకు ఇబ్బందులు లేకుండా వరి కొనుగోలు పూర్తి చేయాలి

వికారాబాద్:

వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా వరి కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయడంతో పాటు రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ దిపాక్ తివారి సూచించారు.
మంగళవారం కలెక్టర్ అదనపు కలెక్టర్ వెంకటాచారితో కలిసి వెంకటరమణ ఇండస్ట్రీస్, కామారెడ్డిగూడ రైస్ మిల్లును సందర్శించి వరి కొనుగోలు, నిల్వలు, మిల్లింగ్ ప్రక్రియలను పరిశీలించారు.
ఈ సందర్భంగా వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి మాట్లాడుతూ ..రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తున్న ధాన్యాన్ని తక్షణమే స్వీకరించాలని, నాణ్యత ప్రమాణాల ప్రకారం మిల్లింగ్ ప్రక్రియను నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని మిల్లు యాజమాన్యానికి ఆదేశించారు. రైతులు ధాన్యం అమ్మకాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
ధాన్యం రవాణా, హమాలి, నిల్వలు, మిల్లింగ్ ప్రక్రియల్లో ఎటువంటి ఆలస్యం చోటుచేసుకోకుండా సంబంధిత శాఖల అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని కలెక్టర్ పేర్కొన్నారు. అవసరమైన చోట ఎక్కువ సంఖ్యలో హమాలీలను ఏర్పాటు చేసి ధాన్యం అన్‌లోడింగ్ మరియు తరలింపు పనులను వేగవంతం చేయాలని సూచించారు.

ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, వరి కొనుగోలు ప్రక్రియను పూర్తిస్థాయిలో పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ దిపాక్ తివారి స్పష్టం చేశారు. ప్రతి రైస్ మిల్లు వద్ద సంబంధిత అధికారులు పర్యవేక్షణ కొనసాగిస్తారని, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సమయానికి పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటాచారి, పోలీసు అధికారులు, పౌర సరఫరాల శాఖ అధికారులు మోహన్ కృష్ణ, సుదర్శన్ తదితరులు, రైస్ మిల్లు యాజమాన్యం పాల్గొన్నారు.WhatsApp Image 2026-05-19 at 19.50.15

About The Author