దేశంలోని అన్ని వర్గాలకు మేలు చేసే బడ్జెట్, మైనారిటీ సంక్షేమం కోసం 3350 కోట్లు కేటాయించడం సంతోషకరం: బిజెపి మైనార్టీ మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి ముజీబ్

కరీంనగర్, ఫిబ్రవరి 6(భారత శక్తి): కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బిజెపి మైనార్టీ మోర్చా జిల్లా శాఖ అధ్యక్షులు ఎండి సమీపర్వెజ్ ఆధ్వర్యంలో గురువారం కరీంనగర్ తెలంగాణ చౌక్ లో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు నిర్మల సీతారామన్, బండి సంజయ్ కుమార్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మైనార్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి ముజీబ్ మాట్లాడుతూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలకు మేలు చేసే విధంగా ఉందని, వికసి త్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయన్నారు. రూ.12లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపు గొప్ప శుభవార్త లాంటిదని, వేతన జీవులకు గొప్ప వరం లాంటిదన్నారు. అలాగే క్యాన్సర్ వంటి ఇతర తీవ్రమైన వ్యాధులకు సంబంధించిన 36 రకాల మందులను ప్రాథమిక కస్టం డ్యూటీ నుంచి మినహాయించడంతోపాటు ఆరు లైఫ్ సేవింగ్ మెడిసిన్స్ పై కస్టం డ్యూటీ ని ఐదు శాతానికి తగ్గించడం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్యాన్సర్ డే కేర్ సెంటర్లు ఏర్పాటు చేయడం అందుకు అవసరమైన మందులు చౌకగా ఉంటాయని మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటన చేయడం సంతోషకరమైన విషయమన్నారు. మొత్తం మీద మందుల జాబితాలో 36 రకాల ప్రాణాలు రక్షించే మందులు ఉండడం హెల్త్ సెక్టార్ ప్రజలకు ఊరటనీచ్చే విషయమన్నారు. బడ్జెట్లో రైతుల శ్రేయస్సు అభివృద్ధి కోసం ప్రయోజనం కలిగే కేటాయింపులు జరిగాయన్నారు. కిసాన్ క్రెడిట్ కార్డు పరిమితి మూడు లక్షల నుండి 5 లక్షల వరకు పెంపు, పప్పు ధాన్యాల ఉత్పత్తికి సమృద్ధి పథకం, పండ్లు కూరగాయల ఉత్పత్తికి కొత్త పథకం ప్రారంభం చేయడం , పీఎం దన్ ధాన్య కృషి యోజన పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించడం లాంటివి రైతాంగానికి ఎంతో తోడ్పాటు లభించేలా ఉన్నాయన్నారు. మొత్తం మీద బడ్జెట్ కేటాయింపులు అన్ని వర్గాలను పేద మధ్యతరగతి ప్రజలను సంతృప్తిపరిచే విధంగా ఉన్నాయని, అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించే, ముఖ్యంగా మైనారిటీ సంక్షేమం అభివృద్ధి కోసం 3350 కోట్లు కేటాయించడం సంతోషకరమని, చారిత్రకమైన బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ , ప్రధాని మోదీకి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బలబ్బీర్ సింగ్, పార్లమెంట్ ఇంచార్జ్ మహమ్మద్ బషీరుద్దీన్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మొహమ్మద్ తాజుద్దీన్, మొహమ్మద్ సిద్ధిక్, జిల్లా ప్రధాన కార్యదర్శులు సయ్యద్ సైజాద్, మొహమ్మద్ సమీ, సాబీర్,ఫసి, సైద్, బిజెపి రూరల్ మైనార్టీ మోర్చా అధ్యక్షుడు అప్రోజ్, రవీందర్ పాల్ సింగ్, రాజ్ పాల్ సింగ్, ఇందర్ జిత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

దేశంలోని అన్ని వర్గాలకు మేలు చేసే బడ్జెట్, మైనారిటీ సంక్షేమం కోసం 3350 కోట్లు కేటాయించడం సంతోషకరం: బిజెపి మైనార్టీ మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి ముజీబ్

కరీంనగర్, ఫిబ్రవరి 6(భారత శక్తి):
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బిజెపి మైనార్టీ మోర్చా జిల్లా శాఖ అధ్యక్షులు ఎండి సమీపర్వెజ్ ఆధ్వర్యంలో గురువారం కరీంనగర్ తెలంగాణ చౌక్ లో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు నిర్మల సీతారామన్, బండి సంజయ్ కుమార్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మైనార్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి ముజీబ్ మాట్లాడుతూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలకు మేలు చేసే విధంగా ఉందని, వికసి త్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయన్నారు. రూ.12లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపు గొప్ప శుభవార్త లాంటిదని, వేతన జీవులకు గొప్ప వరం లాంటిదన్నారు. అలాగే క్యాన్సర్ వంటి ఇతర తీవ్రమైన వ్యాధులకు సంబంధించిన 36 రకాల మందులను ప్రాథమిక కస్టం డ్యూటీ నుంచి మినహాయించడంతోపాటు ఆరు లైఫ్ సేవింగ్ మెడిసిన్స్ పై కస్టం డ్యూటీ ని ఐదు శాతానికి తగ్గించడం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్యాన్సర్ డే కేర్ సెంటర్లు ఏర్పాటు చేయడం అందుకు అవసరమైన మందులు చౌకగా ఉంటాయని మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటన చేయడం సంతోషకరమైన విషయమన్నారు. మొత్తం మీద మందుల జాబితాలో 36 రకాల ప్రాణాలు రక్షించే మందులు ఉండడం హెల్త్ సెక్టార్ ప్రజలకు ఊరటనీచ్చే విషయమన్నారు. బడ్జెట్లో రైతుల శ్రేయస్సు అభివృద్ధి కోసం ప్రయోజనం కలిగే కేటాయింపులు జరిగాయన్నారు. కిసాన్ క్రెడిట్ కార్డు పరిమితి మూడు లక్షల నుండి 5 లక్షల వరకు పెంపు, పప్పు ధాన్యాల ఉత్పత్తికి సమృద్ధి పథకం, పండ్లు కూరగాయల ఉత్పత్తికి కొత్త పథకం ప్రారంభం చేయడం , పీఎం దన్ ధాన్య కృషి యోజన పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించడం లాంటివి రైతాంగానికి ఎంతో తోడ్పాటు లభించేలా ఉన్నాయన్నారు. మొత్తం మీద బడ్జెట్ కేటాయింపులు అన్ని వర్గాలను పేద మధ్యతరగతి ప్రజలను సంతృప్తిపరిచే విధంగా ఉన్నాయని, అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించే, ముఖ్యంగా మైనారిటీ సంక్షేమం అభివృద్ధి కోసం 3350 కోట్లు కేటాయించడం సంతోషకరమని, చారిత్రకమైన బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ , ప్రధాని మోదీకి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు చెప్పారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బలబ్బీర్ సింగ్, పార్లమెంట్ ఇంచార్జ్ మహమ్మద్ బషీరుద్దీన్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మొహమ్మద్ తాజుద్దీన్, మొహమ్మద్ సిద్ధిక్, జిల్లా ప్రధాన కార్యదర్శులు సయ్యద్ సైజాద్, మొహమ్మద్ సమీ, సాబీర్,ఫసి, సైద్, బిజెపి రూరల్ మైనార్టీ మోర్చా అధ్యక్షుడు అప్రోజ్, రవీందర్ పాల్ సింగ్, రాజ్ పాల్ సింగ్, ఇందర్ జిత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

About The Author