ప్రజావాణి వినతుల పరిష్కారానికి చర్యలు చేపట్టాలి:హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య

హనుమకొండ ప్రతినిధి(భారత శక్తి)ఫిబ్రవరి17: ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన వినతుల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులు చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావిణ్య అన్నారు. సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో వివిధ శాఖల జిల్లా అధికారులతో కలిసి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి జిల్లా కలెక్టర్ ప్రావిణ్య, అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, డీఆర్వో వై. వి. గణేష్ వినతులను స్వీకరించారు. ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ 70 వినతులను ప్రజలు సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావిణ్య మాట్లాడుతూ ప్రజలు అందించిన వినతులను వెంటనే పరిష్కరించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో విద్యాలత, డీఆర్డీవో శ్రీను, సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు.

ప్రజావాణి వినతుల పరిష్కారానికి చర్యలు చేపట్టాలి:హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య

హనుమకొండ ప్రతినిధి(భారత శక్తి)ఫిబ్రవరి17:
ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన వినతుల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులు చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావిణ్య అన్నారు.
సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో వివిధ శాఖల జిల్లా అధికారులతో కలిసి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు.
ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి జిల్లా కలెక్టర్ ప్రావిణ్య, అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, డీఆర్వో వై. వి. గణేష్ వినతులను స్వీకరించారు.
ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ 70 వినతులను ప్రజలు సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావిణ్య మాట్లాడుతూ ప్రజలు అందించిన వినతులను వెంటనే పరిష్కరించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో విద్యాలత, డీఆర్డీవో శ్రీను, సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు.

About The Author