గిరిజన గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

గిరిజన గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

భద్రాచలం :

భద్రాచలం గిరిజన గురుకుల పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను 5వ తరగతిలో ప్రవేశాలకు, 6 నుంచి 9వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు భద్రాచలం గిరిజన గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ కుమారి ఎస్.హేమలత సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ గత నెల 11వ తేదీనే ప్రారంభమైందని జనవరి 21 వరకు అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రవేశ పరీక్ష రుసుము రూ.100 ఆన్లైన్లో చెల్లించి దరఖాస్తు చేయాలని సూచించారు. ఫిబ్రవరి 22న ప్రవేశ పరీక్ష ఉంటుందని తెలిపారు. ఎంపిక చేసిన పరీక్షా కేంద్రాల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు పరీక్షలు నిర్వహించబడుతుందని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు TG సెట్.సి.జి.జి.జిఓవి.ఇన్ పరిశీలించాలని ప్రిన్సిపాల్ హేమలత కోరారు.

About The Author