అర్జీలు సకాలంలో పరిష్కరించాలి

రాజన్న సిరిసిల్ల :

కలెక్టర్ సందీప్ కుమార్ ఝా.

185 దరఖాస్తుల రాక.

 

WhatsApp Image 2025-09-15 at 6.22.40 PM

ప్రజావాణి కు వచ్చే అర్జీలు సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు.జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో ప్రజల నుంచి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 185 దరఖాస్తులు వచ్చాయయని రెవెన్యూ 61, డీఆర్డీఏ కు 44, హౌసింగ్ శాఖకు 25, ఉపాధి కల్పన కార్యాలయం,ఎస్డీసీ కార్యాలయానికి 8 చొప్పున, విద్యా శాఖ, జిల్లా పంచాయతీ కార్యాలయానికి 6 చొప్పున, జిల్లా పౌర సరఫరాల అధికారికి 5, ఎస్పీ, జిల్లా లైబ్రరీ సెక్రటరీ, జిల్లా వైద్యాధి కారికి మూడు చొప్పున, మున్సిపల్ కమిషనర్ వేములవాడ,ఈడీఎంకు రెండు చొప్పున, జిల్లా సంక్షేమ అధికారి, మున్సిపల్ కమిషనర్ సిరిసిల్ల, ఏడీ ఎస్ ఎల్ ఆర్, డీఐఈఓ, సీపీఓ, సెస్, జిల్లా నీటి పారుదల శాఖ అధికారి, ఈఈ ఆర్ అండ్ బీ, ఎస్ఆర్ఆర్ టెంపుల్ ఈఓ వేములవాడకు ఒకటి చొప్పున వచ్చాయని అధికారులు తెలిపారు.ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాభాయ్, జెడ్పీ సీఈవో వినోద్ కుమార్, డీఆర్డీఓ శేషాద్రి, జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

Read More తుది మెరుగులు దిద్దుకుంటున్న బ‌మృక్‌నుద్దౌలా చెరువు

About The Author