​బి.ఎన్‌. రెడ్డి నగర్ ఫేజ్-3లో సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన.

రూ. 14 లక్షలతో అభివృద్ధి పనులు: కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి

​బి.ఎన్‌. రెడ్డి నగర్ ఫేజ్-3లో సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన.

వనస్థలిపురం: 

కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా ముందుకు సాగుతున్నట్లు బి.ఎన్‌. రెడ్డి నగర్ డివిజన్ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం డివిజన్ పరిధిలోని బి.ఎన్‌. రెడ్డి నగర్ ఫేజ్-3 కాలనీలో రూ. 14 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న సి.సి. రోడ్ల నిర్మాణ పనులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు.
​ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. కాలనీవాసుల చిరకాల కోరిక మేరకు నిధులు మంజూరు చేయించామని, త్వరలోనే పనులు ప్రారంభించి నాణ్యతతో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. డివిజన్‌ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తానని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతినిధులు
కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు సాయి నికేతన్ (అధ్యక్షులు), సురేష్ కుమార్ (ఉపాధ్యక్షులు), భరత్‌లాల్ రాథోడ్ (ప్రధాన కార్యదర్శి), శ్రీనివాసరావు (కోశాధికారి), సుమని నాయక్ (జాయింట్ సెక్రటరీ) పాల్గొన్నారు. వీరితో పాటు విజయ్ కుమార్, సత్యనారాయణ, మోహన్ రెడ్డి, యాదగిరిరావు, రవి ప్రకాష్, లింగం గౌడ్, భూషణ్, శ్రీనివాస్ గౌడ్, రాజు, భాను ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

About The Author