ముగ్గురి అదృశ్యం: ఆందోళనలో కుటుంబ సభ్యులు

ముగ్గురి అదృశ్యం: ఆందోళనలో కుటుంబ సభ్యులు

ముగ్గురి అదృశ్యం: ఆందోళనలో కుటుంబ సభ్యులుWhatsApp Image 2026-02-03 at 20.02.02 (1)హయత్ నగర్:

పనికి వెళ్లిన భర్త తిరిగి వచ్చేసరికి భార్య, ఇద్దరు పిల్లలు కనిపించకుండా పోయిన ఘటన హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
​ఆకాష్ నగర్ కాలనీకి చెందిన సయ్యద్ హమీద్ వెల్డింగ్ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇతనికి అస్మా బేగంతో 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి నలుగురు పిల్లలు. పెద్దమ్మాయి హాస్టల్‌లో ఉండి చదువుకుంటుండగా, ముగ్గురు కుమారులు తల్లిదండ్రుల వద్దే ఉంటున్నారు.

​పాఠశాలకు వెళ్తున్నానని చెప్పి..

జనవరి 30న ఉదయం 8 గంటలకు హమీద్ కుంట్లూర్ వద్ద ఉన్న తన వెల్డింగ్ షాపునకు వెళ్లాడు. ఉదయం 10:20 గంటల సమయంలో అస్మా బేగం తన తమ్ముడు సల్మాన్‌కు ఫోన్ చేసింది. పాఠశాలలో 'తల్లిదండ్రుల సమావేశం' (PTM) ఉందనీ, పెద్ద కొడుకు ఇబ్రహీంను చూసుకోవాలని చెప్పింది. తనతో పాటు మిగతా ఇద్దరు కుమారులు ఫయాజ్ (7), అద్నాన్‌లను తీసుకుని ఇంట్లో నుంచి బయలుదేరింది.

​వెతికినా లభించని ఆచూకీ:

సాయంత్రం హమీద్ ఇంటికి వచ్చేసరికి భార్యాపిల్లలు కనిపించలేదు. ఇంట్లోనే ఉన్న కుమారుడు ఇబ్రహీంను విచారించగా.. "అమ్మ తమ్ముళ్లను తీసుకుని ఆటోలో వెళ్ళింది" అని చెప్పాడు. బంధువులు, స్నేహితుల ఇళ్లలో వెతికినప్పటికీ వారి ఆచూకీ లభించలేదు. దీంతో బాధితుడు హమీద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

About The Author

Related Posts