మీ ఇంటి ఆడబిడ్డగా ఒక అవకాశం ఇవ్వండి
ఇంటింటి ప్రచారంలో 9వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విభూది మహేశ్వరి
వనపర్తి జిల్లా :
కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి విభూది మహేశ్వరి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నుంచి బీఫామ్ ఇచ్చి నన్ను అభ్యర్థిగా నిలబెట్టి అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే తుడి మెగా రెడ్డి కి ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి కి స్పోర్ట్స్ చైర్మన్ వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శివసేన రెడ్డికి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులకు కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ 9వ వార్డ్ ఓటర్ మహాశయులారా మీ ఇంటి ఆడబిడ్డగా ఒక అవకాశం కల్పించి మద్దతుగా నిలిచి తనను గెలిపిస్తే వార్డులో ఉన్న పలు సమస్యలను అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని ఈ ఐదు సంవత్సరాలు ప్రజల కోసమే నా సేవ అంకితం చేస్తానని తన తండ్రి మాజీ కౌన్సిలర్ విభూది నారాయణ గతంలో 8వ వార్డును ఎంతో అభివృద్ధి చేశారని ఈసారి 9వ వార్డులో కూడా అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నారని మీరు అవకాశం ఇచ్చి తనకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ముఖ్యంగా 9 వ వార్డ్ పలు కాలనీలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో 9వ వార్డు మర్రి కుంట కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ చీర్ల ఆంజనేయులు సుధాకర్ భాష నాయక్ రాంజీ నాయక్ రాములు గుంటి మహేష్ చీర్ల సత్యం గుంటి రాజు చీర్ల అయ్యన్న పీరు నాయక్ తదితర ముఖ్య నాయకులు మహిళా కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
