​క్యాన్సర్‌ రహిత సమాజమే లక్ష్యం: టీకేఆర్‌ విద్యా సంస్థల్లో ప్రపంచ రికార్డు

  • పదివేల మంది విద్యార్థులతో భారీ 'పింక్ రిబ్బన్' రూపకల్పన
    వరల్డ్ బుక్ ఆఫ్ లండన్‌లో చేరిన మహేశ్వరం ఘనత.

​క్యాన్సర్‌ రహిత సమాజమే లక్ష్యం: టీకేఆర్‌ విద్యా సంస్థల్లో ప్రపంచ రికార్డు

మహేశ్వరం:

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని మహేశ్వరం నియోజకవర్గంలోని తీగల కృష్ణారెడ్డి (టీకేఆర్) ఇంజనీరింగ్ కళాశాల వేదికగా అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. టీకేఆర్ ఎడ్యుకేషన్ సొసైటీ, బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పదివేల మందికి పైగా విద్యార్థులు పాల్గొని 'పింక్ రిబ్బన్' ఆకారాన్ని ప్రదర్శించారు. క్యాన్సర్‌పై అవగాహన కల్పిస్తూ విద్యార్థులు చేసిన ఈ ప్రతిజ్ఞ 'వరల్డ్ బుక్ ఆఫ్ లండన్'లో చోటు సంపాదించుకుంది.

​ఇండోనేషియా రికార్డు కనుమరుగు:

​గతంలో ఇండోనేషియాలో 8,000 మందితో నిర్వహించిన క్యాన్సర్ రిబ్బన్ కార్యక్రమమే ఇప్పటివరకు ప్రపంచ రికార్డుగా ఉండేది. తాజాగా టీకేఆర్ కళాశాల విద్యార్థులు 10,000 మందికి పైగా పాల్గొని ఆ రికార్డును అధిగమించారు. ఈ సందర్భంగా 'వరల్డ్ బుక్ ఆఫ్ లండన్' ప్రతినిధి డాక్టర్ ఇలియాజర్ కళాశాల యాజమాన్యానికి రికార్డు పత్రాన్ని అందజేశారు. "10000 Hearts - One Ribbon Pledge" పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమం క్యాన్సర్ రహిత రేపటి కోసం ఒక బలమైన ఆకాంక్షను చాటిచెప్పింది.

​అవగాహనే ఆయుధం: 

తీగల కృష్ణారెడ్డి
​కళాశాల వ్యవస్థాపక చైర్మన్ తీగల కృష్ణారెడ్డి మాట్లాడుతూ, వయస్సుతో సంబంధం లేకుండా నేడు క్యాన్సర్ మహమ్మారి అందరికీ విస్తరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం విద్యాబోధనే కాకుండా, సామాజిక బాధ్యతగా విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. వేలాది మంది విద్యార్థులు ఒక్కటిగా చేరి ఈ ప్రపంచ రికార్డు సృష్టించడం సంతోషకరమన్నారు.

​ముందస్తు పరీక్షలతోనే నివారణ:
​బసవతారకం ఆస్పత్రి సీఈఓ కృష్ణయ్య మాట్లాడుతూ, ఆహారపు అలవాట్లు, జన్యుపరమైన కారణాల వల్ల క్యాన్సర్ ముప్పు పెరుగుతోందని హెచ్చరించారు.

​లక్షణాలను ముందుగానే గుర్తించి వైద్యుల సలహాలు తీసుకోవడం ద్వారా ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చు.
​బసవతారకం ఆస్పత్రి ద్వారా పేదలకు అందుబాటులో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నాం.

​గతంలో టీకేఆర్ కళాశాల వేదికగా మొబైల్ స్క్రీనింగ్ బస్సు ద్వారా ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించామని ఆయన గుర్తు చేశారు.

​ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు 
టాస్క్ సీఈఓ శ్రీకాంత్ సింహ, సీఎఫ్ఓ అల్వాల్ నారాయణ, మెడికల్ ఆంకాలజిస్ట్ రాకేష్ పిన్నింటి, టీకేఆర్ విద్యా సంస్థల కార్యదర్శి హరినాథ్ రెడ్డి, కోశాధికారి అమర్నాథ్ రెడ్డి మరియు కళాశాల సిబ్బంది, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

About The Author

Related Posts