మున్సిపాలిటీ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించాలి.

జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు

మున్సిపాలిటీ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో సజావుగా  నిర్వహించాలి.

వనపర్తి జిల్లా:

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వనపర్తి మున్సిపల్ కార్యాలయం, కొత్తకోట ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పోలింగ్ సరళిని పరిశీలించి, విధుల్లో ఉన్న అధికారులకు పలు సూచనలు జారీ చేశారు.
కలెక్టర్ మాట్లాడుతూ ఓటు వేయడానికి వచ్చే ఓటర్ల తో తప్పనిసరిగా ప్రభుత్వం సూచించిన గుర్తింపు కార్డులను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసిన వారి వివరాలను ఓటరు జాబితాలో స్పష్టంగా మార్క్ చేయాలన్నారు. ఓటు వేసిన ప్రతి ఓటరుకు నిబంధనల ప్రకారం తప్పనిసరిగా సిరా  చుక్కను పెట్టాలని సూచించారు. పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ అంతా అత్యంత పారదర్శకంగా జరగాలని, ఇందుకోసం ప్రతి పోలింగ్ కేంద్రాన్ని తప్పనిసరిగా వీడియో రికార్డింగ్ చేయాలని ఆదేశించారు. పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ముగిసిన అనంతరం, నమోదైన ఓట్ల వివరాలను సంబంధిత అభ్యర్థులకు లేదా వారి ఏజెంట్లకు తెలియజేయాలని సూచించారు.అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య ఆయా మున్సిపాలిటీల కమిషనర్లు, ఎంపీడీవోలు, తహసిల్దారులు కలెక్టర్ వెంట ఉన్నారు.

About The Author