సిపిఐ చర్చలు సఫలం.. కాంగ్రెస్కు మద్దతు

సిపిఐ చర్చలు సఫలం.. కాంగ్రెస్కు మద్దతు

వనపర్తి జిల్లా:
 
వనపర్తి మున్సిపల్ ఎన్నికల పొత్తుపై కాంగ్రెస్తో సిపిఐ  జరిపిన చర్చలు సఫలమయ్యాయని, 33 వార్డుల్లో ఆ పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించామని సిపిఐ పట్టణ కార్యదర్శి జే రమేష్ అన్నారు. సిపిఐ ఆఫీస్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఎన్నికల్లో 19, 21 వార్డులను సిపిఐ కి కేటాయించాలని జిల్లా కార్యదర్శి విజయరాములు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే తూడి మెగా రెడ్డికి వినతిపత్రం సమర్పించడం జరిగిందని, ఆ రెండు వార్డులకు నామినేషన్లు కూడా వేశామన్నారు. ఏఐసీసీ అబ్జర్వర్ విశ్వనాథన్, పశువర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, డిసిసి అధ్యక్షుడు మరో మారు పొత్తుల భాగంగా రెండు సీట్లు కేటాయించాలని కోరామన్నారు. ప్రతి వార్డులో కాంగ్రెస్ అభ్యర్థుల నుంచి తీవ్ర ఒత్తిడి ఉన్నందున వార్డులను కేటాయించలేమని, ప్రత్యామ్నాయంగా నామినేటెడ్ పోస్టులను ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. అందువల్ల వనపర్తి పట్టణం అన్ని వార్డుల్లో సిపిఐ కాంగ్రెస్కు మద్దతు ఇచ్చేందుకు నిర్ణయించిందని, పట్టణ ప్రజలు కాంగ్రెస్కు ఓటు వేసి వార్డు సభ్యులను గెలిపించాలని కోరారు. సిపిఐ సీనియర్ నేత కళావతమ్మ, పట్టణ సహాయ కార్యదర్శి గోపాలకృష్ణ, మాజీ వార్డు సభ్యుడు లక్ష్మీనారాయణ, డి శేఖర్ ,జయమ్మ, వంశీ తదితరులు పాల్గొన్నారు.

About The Author