శ్రీశైలం లో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు పరిశీలిస్తున్న .ఎస్పీ సునీల్ షొరాణ్.!
- ప్రభుత్వ శాఖల సమన్వయంతో శివరాత్రి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలి.!
- భక్తులు ఇతరులకు ఆటంకం లేకుండా పోలీసు వారి సూచనలను పాటిస్తూ తమ వాహనాలను పార్కింగ్ చేసుకోవాలని విజ్ఞప్తి.!
శ్రీశైలం:
నంద్యాల జిల్లా శ్రీశైలం నందు జరగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారిని దర్శనం నిమిత్తం వచ్చే భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకొని వారికి ఎలాంటి ఆటంకాలు, అవాంఛనీయ సంఘటనలు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ IPS పోలీస్ అధికారులను ఆదేశించారు. ఎస్పీ సంబంధిత పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించడం జరిగింది .అనంతరం శ్రీశైలం నందు భక్తులకు ట్రాఫిక్ అంతరాయం లేకుండా తీసుకునే చర్యలలో భాగంగా శ్రీశైలం నందు గల పార్కింగ్ ప్రదేశాలను అనగా రింగ్ రోడ్డు వద్ద గల పార్కింగ్ ప్రదేశాలను,RTCబస్టాండ్, సాక్షి గణపతి, హటకేశ్వరం ,సుండిపెంట గ్రామం నందు లింగాల గట్టు మొదలగుప్రదేశాలలో స్వయంగా పర్యటించి ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, మరియు లింగాలగట్టు స్నానఘాట్ లను కూడా పరిశీలించి సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేయడం జరిగింది. భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారి దర్శనం నిమిత్తం విచ్చేయు భక్తులు పోలీసు వారి సూచనలను పాటిస్తూ తమ వాహనాలను ఇతరులకు ఆటంకం లేకుండా పార్కింగ్ చేసుకోవాలని,రోడ్డుకు ఇరువైపులా ఎట్టి పరిస్థితుల్లో పార్కింగ్ చేయరాదని విజ్ఞప్తి చేశారు.
