న్యాయవాది హత్య చేసిన దుండగులను వెంటనే శిక్షించాలి.

న్యాయవాది హత్య చేసిన దుండగులను వెంటనే శిక్షించాలి.

నాగర్ కర్నూలు:
 చేవెళ్ల న్యాయవాద సోదరీమణి స్వప్నను హత్య చేసిన దుండగులను వెంటనే  కఠినాతి కఠినంగా శిక్షించాలని నాగర్ కర్నూల్ జిల్లా బార్ ప్రెసిడెంట్ రవికాంత్ రావు డిమాండ్ చేశాడు. గురువారం జిల్లా కోర్టు ముందు న్యాయవాదుల తో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో ప్రజల తరఫున న్యాయపోరాటం చేస్తున్న న్యాయవాదుల పైన దాడులకు పాల్పడుతున్న  వ్యక్తులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. గతంలోనూ న్యాయవాదుల పైన దాడులు చేసి క్రూరంగా హతమార్చిన వ్యక్తులు తమ పలుకుబడి ఉపయోగించుకొని   చట్టాలను లెక్కచేయకుండా యదేచ్చగా తిరిగి సమాజంలో తిరుగుతున్నారు. 
హత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించే వరకు న్యాయవాదులు సమష్టిగా పోరాడతామని అన్నారు.

అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ బిల్లును వెంటనే ప్రవేశపెట్టాలని  డిమాండ్ చేశారు.
ఈ కేసుపై వెంటనే ఫాస్ట్రాక్  కోర్టు ఏర్పాటు చేసి స్పెషల్ పీపీని నియమించి త్వరితగతిన మూడు నెలల వ్యవధిలోనే కేసు పూర్త చేసి అంతకులకు శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని 
డిమాండ్ చేశారు.దేశంలో ఉన్న న్యాయవాదులందరు ఇలా అడ్వకేట్ల పై దాడికి పాల్పడే వారి కేసులను వాదించకూడదని  న్యాయవాదులను కోరడం జరిగింది.ఈ కార్యక్రమంలో  నాగర్ కర్నూల్, కొల్లాపూర్ న్యాయవాదులు పాల్గొన్నారు.

About The Author

Related Posts