ముజ్గి మల్లన్న జాతర ఏర్పాట్లను పరిశీలించిన నిర్మల్ ఏఎస్పీ సాయికిరణ్

ముజ్గి మల్లన్న జాతర ఏర్పాట్లను పరిశీలించిన నిర్మల్ ఏఎస్పీ సాయికిరణ్

ఉమ్మడి ఆదిలాబాద్ :      

జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల  ఆదేశాల మేరకు, ఈరోజు నిర్మల్ ఏఎస్పీ సాయికిరణ్, నిర్మల్ రూరల్ మండలంలోని ముజ్గి గ్రామాన్ని సందర్శించి, రేపటి నుండి ప్రారంభమయ్యే మల్లన్న జాతర ఏర్పాట్లను పరిశీలించారు.ఈ సందర్భంగా మల్లన్న స్వామి ఆలయం వద్ద భద్రతా ఏర్పాట్లు, భక్తుల రాకపోకలు, గుంపు నియంత్రణ (Crowd Management), ట్రాఫిక్ నియంత్రణ, అలాగే భక్తులకు అందించాల్సిన సౌకర్యాలను సమీక్షించారు.
*ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ...మల్లన్న జాతర సందర్భంగా కఠిన బందోబస్తు, సమర్థవంతమైన ట్రాఫిక్ నియంత్రణ, భక్తుల భద్రతకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా, భక్తులు ప్రశాంతంగా జాతరను నిర్వహించుకునేలా పోలీసులు అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు.
ఈ పరిశీలనలో నిర్మల్ ఏ ఎస్పీ సాయి కిరణ్. తో పాటు,రూరల్ ఇన్స్పెక్టర్ కృష్ణ, ఎస్ఐ లింబాద్రి, ఇంకా పోలీసు సిబ్బంది ఉన్నారు.

About The Author